News August 22, 2024

ఏపీలో వాలంటీర్ల కీలక నిర్ణయం!

image

AP: ఉద్యోగ భద్రతపై ఆందోళనలో ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లు ఉద్యమానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెండింగ్ బకాయిలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన రూ.10,000 గౌరవ వేతనం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో దానిపై నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల 31న విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ ప్రణాళిక రూపొందించాలని భావిస్తున్నారు.

Similar News

News September 19, 2024

పంత్‌తో డేటింగ్.. అవి రూమర్లే: ఊర్వశి

image

భారత క్రికెటర్ రిషభ్ పంత్‌తో తాను డేటింగ్ చేసినట్లు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని నటి ఊర్వశీ రౌతేలా స్పష్టం చేశారు. ‘నేను నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతాను. ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా కెరీర్‌పైనే ఉంది. పంత్‌ విషయంలో వచ్చినవన్నీ రూమర్లే. వాటిపై పారదర్శకత మెయింటెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మీమ్ పేజీలకు ఎందుకింత అత్యుత్సాహమో నాకు అర్థం కావట్లేదు’ అని పేర్కొన్నారు.

News September 19, 2024

పవన్‌తో ముగిసిన బాలినేని, సామినేని భేటీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వైసీపీ మాజీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను భేటీ ముగిసింది. ఈ నెల 22న జనసేనలో చేరుతున్నట్లు ఉదయభాను ప్రకటించారు. జనసేన బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మరోవైపు త్వరలో ఒంగోలులో కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్‌ను ఆహ్వానించి జనసేనలో చేరతానని బాలినేని తెలిపారు. అందరినీ కలుపుకుని ఆ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

News September 19, 2024

వరదల తర్వాత అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయింది: VSR

image

AP: విజయవాడ వరదల తర్వాత రాజధాని అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బుడమేరు వరదలు, అమరావతి భవిష్యత్‌పై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఒకరి కల కోసం రాష్ట్రానికి కోట్లు ఖర్చు చేసే స్థోమత లేదు. పెట్టుబడి దారుల విశ్వాసం సన్నగిల్లింది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.