News February 25, 2025
హతవిధీ.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం..!

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభించిన 6 రోజుల్లోనే అతిథ్య పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, న్యూజిలాండ్‌పై వరుస ఓటములతో ఆ జట్టు మరో మ్యాచ్ ఉండగానే సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో ఓ ICC టోర్నీ జరుగుతోంది. కానీ ఆ ఆనందాన్ని ఆరు రోజులు కూడా ఆ దేశం నిలుపుకోలేకపోయింది. ఈ నెల 27న బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. పాక్ ప్రదర్శనపై మీ కామెంట్.
Similar News
News January 6, 2026
దేశంలో ఎత్తైన ఆంజనేయుడి విగ్రహాలివే!

భారత ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ ఆంజనేయుడి భారీ విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తున్నాయి. APలోని శ్రీకాకుళం(176ft), పరిటాల(135ft), కర్ణాటకలోని బిదనగెరె(161ft)లో ఎత్తైన విగ్రహాలు అబ్బురపరుస్తాయి. ఢిల్లీ, సిమ్లా, ఒడిశాలోనూ ఒక్కో విగ్రహం 108 అడుగుల ఎత్తులో ఉంటుంది. UP హనుమాన్ధామ్లో 125ft, హనుమాన్ నందురా(MH)లో 105ft , బెంగళూరులోని హనుమాన్ అగరాలో 102అడుగుల ఎత్తున్న ప్రతిమలు దర్శనమిస్తాయి.
News January 6, 2026
‘గ్రీన్‌ల్యాండ్’పై ట్రంప్ ఎందుకు కన్నేశారంటే?

గ్రీన్‌ల్యాండ్ కావాలన్న US <<18765231>>కోరిక<<>> వెనుక రక్షణతోపాటు అక్కడ దొరికే రేర్ ఎర్త్ మినరల్స్, యురేనియం, ఐరన్ కారణమని తెలుస్తోంది. అయితే ఇది ఇప్పటి కోరిక కాదు. 1867లో రష్యా నుంచి అలాస్కాని కొన్నప్పుడే దీనిపై సంప్రదించింది. 1946లో $100M ఆఫర్ కూడా చేసింది. ఒకవేళ రష్యా క్షిపణులతో దాడిచేస్తే న్యూక్లియర్ మిస్సైళ్లు పంపేందుకు USకు నార్త్ పోల్, గ్రీన్‌ల్యాండ్ దగ్గర దారి అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
News January 6, 2026
వంటింటి చిట్కాలు

☛ క్యాబేజీ వాసన రాకుండా ఉండాలంటే వండేటప్పుడు అందులో చిన్న అల్లం ముక్క వేయాలి.
☛ కూరల్లో ఉప్పు ఎక్కువైతే కాస్త పాల మీగడ కలిపితే చాలా రుచిగా ఉంటుంది.
☛ పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం చక్కెర కలిపితే పూరీలు చాలా సేపటి వరకు తాజాగా ఉంటాయి.
☛ కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదు పోవడంతో పాటు కూర రుచిగా ఉంటుంది.
☛ అప్పడాలను వేయించే ముందు కాసేపు ఎండలో ఉంచితే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి.


