News May 24, 2024

దేశీయ మార్కెట్లోనే అతిపెద్ద ఐపీఓ!

image

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఓ ద్వారా $3 బిలియన్లు రాబట్టాలని సంస్థ ప్లాన్ చేస్తోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే LIC రికార్డ్ ($2.7 బిలియన్లు) బ్రేక్ చేసి భారత మార్కెట్లో అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ఇక మొత్తంగా కంపెనీ విలువ $20 బిలియన్లు నమోదు చేయొచ్చని అంచనా వేస్తున్నాయి.

Similar News

News February 18, 2025

మా వాళ్లు సెమీస్‌కు వెళ్తే గొప్పే: కమ్రాన్ అక్మల్

image

పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తన సొంత దేశంపై విమర్శలు గుప్పించారు. పాక్ జట్టు సెమీస్ వరకూ వెళ్తే గ్రేట్ అంటూ ఎద్దేవా చేశారు. ‘మా జట్టులో చాలా లోపాలున్నాయి. సరైన స్పిన్నర్లే లేరు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ సమస్యలే. సెలక్షనే సరిగ్గా లేదు. నా దృష్టిలో ఇండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు చేరతాయి. మా జట్టు సెమీస్‌కు చేరితే అది గొప్పే’ అని వ్యాఖ్యానించారు.

News February 18, 2025

సిక్కుల తలపాగాలు తీయించిన అమెరికా?

image

అక్రమ వలసదారుల్ని అమెరికా భారత్‌కు పంపించేస్తున్న సంగతి తెలిసిందే. తొలి విమానంలో వచ్చిన వారికి సంకెళ్లు వేసి తీసుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజా విమానంలో సిక్కుల తలపాగాలను తీయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 116మంది వలసదారులతో కూడిన విమానం నిన్న అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఎలాగూ వెనక్కి పంపిస్తున్న అమెరికా, ఇలాంటి పనులు చేయడమేంటంటూ వలసదారులు మండిపడుతున్నారు.

News February 18, 2025

మా నాయకత్వాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుంది: సీఎం సిద్ధరామయ్య

image

కర్ణాటకలో ‘లీడర్‌షిప్ రొటేషన్’లో భాగంగా సీఎంగా సిద్ధరామయ్యను తప్పించి మరో నేతను కాంగ్రెస్ ఎంపిక చేస్తుందన్న వార్తలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని సిద్ధరామయ్య కొట్టిపారేశారు. కర్ణాటకలో నాయకత్వంపై కాంగ్రెస్ హైకమాండ్ చూసుకుంటుందని, దాని గురించి పెద్ద చర్చ అక్కర్లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న శివకుమార్‌కు సీఎం పదవి రావొచ్చని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.

error: Content is protected !!