News July 9, 2024

HYD జూలో ఎన్‌క్లోజర్ నుంచి తప్పించుకున్న సింహం.. 20 నిమిషాల్లోనే!

image

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని ఎన్‌క్లోజర్ నుంచి ఆఫ్రికన్ లేడీ సింహం శిరీష తప్పించుకుంది. ఎన్‌క్లోజర్ శుభ్రం చేశాక డోర్లు సరిగ్గా మూయకపోవడంతో ఉదయం 10.20 గంటలకు శిరీష తప్పించుకుంది. అప్పటికే పక్షవాతంతో చికిత్స పొందుతోన్న ఈ సింహాన్ని 20 నిమిషాల తర్వాత ఎన్‌క్లోజర్‌లోకి చేర్చినట్లు అధికారులు తెలిపారు. గేట్లన్నీ మూసేసి సింహాన్ని బంధించామని, ఓ యానిమల్ కీపర్‌కి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు.

Similar News

News December 16, 2025

వచ్చే నెలలో భోగాపురంలో ట్రయల్ రన్: రామ్మోహన్ నాయుడు

image

AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును వచ్చే ఏడాది మే నాటికి ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని, విమానాశ్రయాన్ని అందంగా సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో GMR-మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ఒప్పంద కార్యక్రమంలో లోకేశ్, రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రతి ఏటా ఏవియేషన్ రంగం 12% వృద్ధి రేటుతో పురోగమిస్తోందని వివరించారు.

News December 16, 2025

నువ్వుల పంటలో కలుపు నివారణ, అంతరకృషి

image

నువ్వుల పంట విత్తిన 24-48 గంటల్లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 30%ఇ.సి. 700mlను కలిపి పిచికారీ చేస్తే 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పిచికారీ సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తిన తర్వాత వర్షం పడే సూచనలు ఉంటే పెండిమిథాలిన్ పిచికారీ చేయకూడదు. అలాగే దీని పిచికారీ తర్వాత నీటి తడి పెట్టకూడదు. విత్తిన 15-20 రోజుల లోపు అదనపు మొక్కలను, 25-30 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి.

News December 16, 2025

భారత్‌లోనూ 16 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ చేయాలా?

image

భారత్‌లో 16 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 60% పిల్లలు ప్రతిరోజూ దాదాపు 3 గంటలు వివిధ SM ప్లాట్‌ఫామ్‌లు, గేమింగ్ సైట్లలో గడుపుతున్నట్టు స్టడీలు వెల్లడిస్తున్నాయి. అది వ్యసనంగా మారి మానసిక ఆరోగ్య సమస్యలు, సైబర్ దాడుల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. <<18520645>>ఆస్ట్రేలియా<<>>లో చేసినట్టే భారత్‌లోనూ నిషేధించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.