News July 9, 2024

HYD జూలో ఎన్‌క్లోజర్ నుంచి తప్పించుకున్న సింహం.. 20 నిమిషాల్లోనే!

image

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని ఎన్‌క్లోజర్ నుంచి ఆఫ్రికన్ లేడీ సింహం శిరీష తప్పించుకుంది. ఎన్‌క్లోజర్ శుభ్రం చేశాక డోర్లు సరిగ్గా మూయకపోవడంతో ఉదయం 10.20 గంటలకు శిరీష తప్పించుకుంది. అప్పటికే పక్షవాతంతో చికిత్స పొందుతోన్న ఈ సింహాన్ని 20 నిమిషాల తర్వాత ఎన్‌క్లోజర్‌లోకి చేర్చినట్లు అధికారులు తెలిపారు. గేట్లన్నీ మూసేసి సింహాన్ని బంధించామని, ఓ యానిమల్ కీపర్‌కి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు.

Similar News

News October 14, 2024

జంగిల్ క్లియరెన్స్ తర్వాత అమరావతి ఇలా..

image

AP: అమరావతి నిర్మాణంపై కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. దీంతో ఇప్పటివరకూ ముళ్ల కంపలు, పిచ్చి చెట్లతో చిన్నపాటి అడవిలా దర్శనమిచ్చిన ఆ ప్రాంతమంతా చూడచక్కగా కనిపిస్తోంది. ఇటు ప్రధాన రహదారులు, ఇతర నిర్మాణాలకు టెండర్లను సైతం డిసెంబర్‌లోపు ఖరారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

News October 14, 2024

న్యూ లిక్కర్ పాలసీ.. ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం

image

AP: మద్యం షాపులకు ఇవాళ జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. షాపు దక్కించుకున్న వారు చెల్లించే తొలి విడత లైసెన్స్ రుసుముతో సుమారు రూ.300 కోట్ల ఆదాయం లభిస్తుంది. అలాగే వారం రోజులు సరకు కొనుగోలు ద్వారా మరో రూ.300 కోట్లకు పైగా వస్తుంది. ఇప్పటికే ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం లభించింది. మొత్తంగా నూతన పాలసీ ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం సమకూరుతుంది.

News October 14, 2024

రేషన్ బియ్యం తింటే ఇన్ని లాభాలా?

image

రూపాయికే కిలో బియ్యం అనేసరికి అంతా చులకనగా చూస్తుంటారు. మార్కెట్‌లో దొరికే సన్న బియ్యంవైపు మొగ్గుచూపుతుంటారు. కానీ, రేషన్ బియ్యం తింటే పోషకాలు పుష్టిగా లభిస్తాయనే విషయం మీకు తెలుసా? ప్రజల్లో రక్తహీనత, విటమిన్ల లోపం ఉందని గుర్తించిన కేంద్రం.. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తోంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12లను యాడ్ చేసిన బియ్యాన్ని 2028 DEC వరకు ఉచితంగా ఇవ్వనుంది.
SHARE IT