News January 17, 2025
100 ఏళ్లుగా కుంభమేళాకు వస్తున్న స్వామి

యూపీకి చెందిన యోగా సాధకులు స్వామి శివానంద 100 ఏళ్లుగా ప్రతి కుంభమేళాకు హాజరవుతున్నారని ఆయన శిష్యులు చెబుతున్నారు. ఆధార్ ప్రకారం ఆయన వయసు 129 ఏళ్లు. ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 16వద్ద ఆయన క్యాంపు ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం యోగా చేస్తుండగా ఆయన కోసం భక్తులు క్యూ కడుతున్నారు. ఆయన ఉప్పు, నూనె లేకుండా ఉడికించిన ఆహారం తీసుకుంటారని తెలిపారు. రెండేళ్ల క్రితం ఆయనను కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది.
Similar News
News November 12, 2025
‘తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా చూడండి’

AP: మొంథా తుఫాన్ నష్టంపై వేగంగా నివేదిక ఇచ్చి.. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం CMతో సమావేశమైంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బృంద సభ్యులను సీఎం కోరారు.
News November 12, 2025
SBIలో మేనేజర్ పోస్టులు

<
News November 12, 2025
వేగం వద్దు.. ఇలా కూడా ఆనందపడవచ్చు!

బైక్, కార్లలో వేగంగా ప్రయాణించడం ద్వారా పొందే తాత్కాలిక సంతోషం కంటే, దైవ స్మరణలో నిమగ్నమై ఆ దైవత్వం గొప్పతనాన్ని తెలుసుకుంటే మనిషికి అంతకన్నా ఉన్నత స్థాయి ఉండదు. జీవితంలో నిజమైన ఆనందం ఆ వేగంలో లేదు. పరమాత్మ సృష్టించిన లోకంలోనే ఉంది. కోయిల నాదంలో, కురిసే చినుకులో, పూసే పూవులో, చిన్నపిల్లల మాటల్లో ఆ ఆనందాన్ని అనుభవించాలి. నిస్వార్థంగా ఇతరులకు చేసే సాయంలో లభించే సంతృప్తి ఎంతో గొప్పది.


