News May 4, 2024
LTI యాక్ట్ ఇంకా రూపకల్పన దశలోనే ఉంది: సజ్జల
AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. ‘ఈ చట్టం ఇంకా రూపకల్పన దశలోనే ఉంది. ఇంకా గెజిట్ రాలేదు.. విధివిధానాలు ఖరారు కాలేదు. అక్రమాలకు చెక్ పెట్టే విధంగా ఈ యాక్ట్ ఉంటుంది. సమగ్ర భూసర్వే పూర్తయిన తర్వాతే అమల్లోకి వస్తుంది. భూ కబ్జాలు చేసే చంద్రబాబు లాంటి వాళ్లకు ఇలాంటి చట్టాలు రావడం ఇష్టం ఉండదు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News December 27, 2024
RARE PHOTO: తొలి డాక్టరమ్మలు!
పైనున్న ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు మహిళలెవరని ఆలోచిస్తున్నారా? ఈ ముగ్గురూ వైద్యులుగా లైసెన్స్ పొందిన తొలి మహిళలు. 1885లో తీసిన ఈ ఫొటోలో ఓ భారతీయురాలు కూడా ఉండటం విశేషం. ఆమె పేరు ఆనందీబాయి జోషి(చీరలో ఉన్నారు). మరో ఇద్దరు జపాన్‌కు చెందిన కెయి ఒకామి, సిరియా నుంచి సబాత్ ఇస్లాంబూలీ. కాగా, ఆనందీబాయి 1886లో వైద్య విద్యలో పట్టా పొందారు.
News December 27, 2024
రేపు ఒకపూట సెలవు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ఒకపూట సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. ఇప్పటికే 7 రోజుల పాటు సంతాప దినాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ఇవాళ సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.
News December 27, 2024
‘మోదీ చెప్పినట్టే ICU బెడ్‌పై రూపాయి’
USD/INR 85.82 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరడంతో PM మోదీపై విమర్శలు వస్తున్నాయి. UPA హయాంలో రూపాయి విలువ పడిపోయినప్పుడు ఆయన చేసిన ట్వీట్లను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. మోదీ చెప్పినట్టు రూపాయి నిజంగానే ICU బెడ్‌పై ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘మమ్మల్ని గెలిపిస్తే 100 రోజుల్లో ఇన్ఫ్లేషన్ తగ్గిస్తాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రూపాయి ICUలో చేరింద’ని 2013లో మోదీ ట్వీటారు.