News May 4, 2024
LTI యాక్ట్ ఇంకా రూపకల్పన దశలోనే ఉంది: సజ్జల
AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. ‘ఈ చట్టం ఇంకా రూపకల్పన దశలోనే ఉంది. ఇంకా గెజిట్ రాలేదు.. విధివిధానాలు ఖరారు కాలేదు. అక్రమాలకు చెక్ పెట్టే విధంగా ఈ యాక్ట్ ఉంటుంది. సమగ్ర భూసర్వే పూర్తయిన తర్వాతే అమల్లోకి వస్తుంది. భూ కబ్జాలు చేసే చంద్రబాబు లాంటి వాళ్లకు ఇలాంటి చట్టాలు రావడం ఇష్టం ఉండదు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News November 4, 2024
ప్రతి న్యూడ్ పెయింటింగ్ అశ్లీలం కాదు: బాంబే HC
ప్రతి నగ్న పెయింటింగ్ అశ్లీలమైనది కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. ప్రఖ్యాత భారతీయ కళాకారులు ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా, అక్బర్ పదమ్‌సీల 7 చిత్రాలను విడుదల చేయాలని కస్టమ్స్ అధికారులను ఆదేశించింది. ‘అసభ్యకరం’ అనే కారణంతో ఆ కళాకృతులను జప్తు చేసిన అధికారులను హెచ్చరించింది. మైఖేలాంజెలో చెక్కిన నగ్న శిల్పం ఇండియాలోకి వచ్చినపుడు దానికి బట్టలు వేయాలని ఇండియన్ కస్టమ్స్ చట్టాలు చెప్పలేదని గుర్తు చేసింది.
News November 4, 2024
కేంద్రమంత్రితో MP శ్రీకృష్ణదేవరాయలు భేటీ
AP: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాతో TDP MP లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. NIPER ఏర్పాటుకు భూమితో పాటు అన్ని విధాలుగా సహకరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని నడ్డాను కోరారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఆరోగ్య పరీక్షలు చేసే కేంద్రాలను ఉత్తరాంధ్రలో లేదా రాయలసీమలో ఏర్పాటు చేయాలని విన్నవించారు. రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంచేలా వెసులుబాటు కల్పించాలని కోరారు.
News November 4, 2024
‘ఆమె’ కాదు ‘అతను’..? ఖెలీఫ్‌లో XY క్రోమోజోమ్‌లు?
ప్యారిస్ ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన అల్జీరియా బాక్సర్ ఇమానే ఖెలీఫ్‌కు XY క్రోమోజోమ్‌లు, అంతర్గత వృషణాలు ఉన్నట్లు ఇటీవల లీకైన వైద్య నివేదిక ద్వారా తెలుస్తోంది. సహజంగా XY క్రోమోజోమ్‌లు పురుషుల్లో ఉంటాయి. ఖెలీఫ్‌ను మహిళల విభాగంలో అనుమతించడం గతంలో తీవ్ర వివాదం రేపింది. ఖెలీఫ్‌కు ఇచ్చిన స్వర్ణాన్ని వెనక్కి తీసుకోవాలని ICONS కో ఫౌండర్ మార్షీ స్మిత్ డిమాండ్ చేశారు.