News March 30, 2024
కండక్టర్ల నిర్వాకం.. ప్రభుత్వంపై భారీ భారం
TG: మహిళలకు RTC బస్సుల్లో ఫ్రీ జర్నీ కోసం జీరో టికెట్ల జారీలో కండక్టర్లు తిరకాసు చేస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియోను పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తుండటంతో అవసరం లేకపోయినా ఎక్కువ జీరో టికెట్లు ఇచ్చేస్తున్నారు. వరంగల్ రీజియన్‌లో ఓ కండక్టర్ అదనంగా రూ.లక్ష విలువైన టికెట్లు జారీచేశారు. చాలా చోట్ల ఇలానే జరుగుతుండటంతో ఈ డబ్బులు చెల్లించే ప్రభుత్వంపై భారీ భారం పడుతోంది.
Similar News
News January 20, 2025
ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఖరారైనట్లు తెలుస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలకు కూడా ఈయనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. కాగా, ‘నా ప్లేస్‌కు తిరిగి వచ్చాను’ అంటూ హర్షవర్ధన్ కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం గమనార్హం.
News January 20, 2025
సిగ్నల్ లేకపోయినా కాల్ మాట్లాడొచ్చు!
కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇంటర్-సర్కిల్ రోమింగ్‌ను ప్రారంభించింది. దీనిద్వారా జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సిగ్నలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 4G నెట్‌వర్క్ అందిస్తుంది. యూజర్ వాడే సిమ్‌లో నెట్‌వర్క్ లేకపోయినా అందుబాటులో ఉన్న ఏ నెట్‌వర్క్‌నైనా ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం టెలికం యూజర్లకు ఎంతో ఉపయోగపడనుంది.
News January 20, 2025
బాబా రామ్‌దేవ్‌పై అరెస్ట్ వారెంట్
బాబా రామ్ దేవ్, పతంజలి MD ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో అరెస్ట్ చేయాలని ఆదేశించింది. మందులు, వ్యాధుల నివారణపై దివ్య ఫార్మసీ తప్పుడు ప్రకటనలు ఇస్తున్నట్లు ఆ రాష్ట్రంలో పలు కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి కోర్టు ముందు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.