News April 11, 2024

నకిలీ డాక్టర్ల భరతం పడుతున్న వైద్యశాఖ

image

TG: రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ నకిలీ డాక్టర్ల భరతం పడుతోంది. HYD మౌలాలీలో భోగ పాండు అనే ఫేక్ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి విద్యార్హత లేకున్నా MBBSగా చలామణీ అవుతున్నట్లు గుర్తించారు. మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయొద్దని ఇప్పటికే వైద్యశాఖ హెచ్చరించింది. అయినా కొందరు ఫేక్ డాక్టర్లు ఇష్టానుసారంగా క్లినిక్‌లు నడుపుతుండటంతో అధికారులు రైడ్స్ చేస్తున్నారు.

Similar News

News March 8, 2026

విద్యార్థులకు సూపర్ న్యూస్

image

TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రభుత్వం అమలు చేయనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో 21 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. అలాగే ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు వారంలో 3 రోజులు రాగి జావ ఇస్తున్నారు. మిగిలిన 3 రోజులు పాలను అందించాలని అధికారులు నిర్ణయించారు. కాలేజీ స్టూడెంట్లకూ పాలు, రాగి జావ ఇవ్వాలని ఇంటర్ విద్యాశాఖ కోరుతోంది.

News March 8, 2026

అందుకే భారత్‌కు మినహాయింపు: ట్రంప్

image

మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలతో ప్రపంచ దేశాల్లోని ఇంధన మార్కెట్లపై ఒత్తిడి పడిందని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దాన్ని తగ్గించేందుకే భారత్‌కు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు 30 రోజుల మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. దీని వల్ల రష్యాకు ఉపయోగం ఉండదన్నారు. వాణిజ్యంలో భారత్‌ తమకు కీలక భాగస్వామి అని అన్నారు. అటు ఆయిల్ కొనుగోలులో తమకు ఎవరి అనుమతీ అక్కర్లేదని USకు భారత్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

News March 8, 2026

CA ఫలితాలు విడుదల

image

ఛార్టర్డ్ అకౌంటెన్సీ(CA) ఫలితాలను ICAI రిలీజ్ చేసింది. ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల రిజల్ట్స్‌ను <>వెబ్‌సైట్‌<<>>లో ఉంచినట్లు తెలిపింది. అలాగే ఆలిండియా మెరిట్ లిస్టును అందుబాటులో ఉంచింది. జనవరి 18, 20, 22, 24 తేదీల్లో పరీక్షలు జరిగాయి. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్, రోల్ నంబర్లు ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ICAI ఏటా 3 సార్లు(జనవరి, మే/జూన్, సెప్టెంబర్) ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తుంది.