News April 11, 2024
నకిలీ డాక్టర్ల భరతం పడుతున్న వైద్యశాఖ

TG: రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ నకిలీ డాక్టర్ల భరతం పడుతోంది. HYD మౌలాలీలో భోగ పాండు అనే ఫేక్ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి విద్యార్హత లేకున్నా MBBSగా చలామణీ అవుతున్నట్లు గుర్తించారు. మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయొద్దని ఇప్పటికే వైద్యశాఖ హెచ్చరించింది. అయినా కొందరు ఫేక్ డాక్టర్లు ఇష్టానుసారంగా క్లినిక్‌లు నడుపుతుండటంతో అధికారులు రైడ్స్ చేస్తున్నారు.
Similar News
News March 21, 2025
పాస్టర్ల గౌరవ వేతనం విడుదల

AP: రాష్ట్రంలోని పాస్టర్లకు మూడు నెలల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,427మంది పాస్టర్లకు రూ.12,82,78,000 నిధులు విడుదల చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం గత ఏడాది మే నెల నుంచి పాస్టర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తున్న సంగతి తెలిసిందే.
News March 21, 2025
రానున్న 3 నెలలు జాగ్రత్త: సీఎస్ విజయానంద్

AP: రానున్న 3 నెలలు అధిక ఉష్ణోగ్రత, వడగాలుల పట్ల రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) కె.విజయానంద్ సూచించారు. వడగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు ముందు జాగ్రత్త చర్యలు ముఖ్యమన్నారు. వడదెబ్బ తాకకుండా నీటిని అధికంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో ఈ మేరకు వీడియో సమావేశం ద్వారా సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
News March 21, 2025
ఉదయాన్నే వేడి నీరు తాగుతున్నారా?

నిద్ర లేవగానే చాలా మంది నీళ్లు తాగుతుంటారు. అయితే బరువు తగ్గడం కోసం ఖాళీ కడుపుతో వేడి నీరు తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా వేడి నీరు తీసుకుంటే దంత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే టేస్ట్ బడ్స్ కూడా దెబ్బతిని ఆహార పదార్థాల రుచి తెలియకుండా పోతుంది. జీర్ణ వ్యవస్థనూ ఇబ్బంది పెట్టి కడుపునొప్పికి కారణమవుతుంది. గోరు వెచ్చని నీరు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.