News November 9, 2024
విద్యార్థుల నిరసనపై స్పందించిన మంత్రి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జోడూరు పాఠశాలలో గిరిజన విద్యార్థులు తమకు టీచర్ కావాలంటూ <<14563913>>నిరసన<<>> వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. టీచర్ను నియమించాలని ఐటీడీఏ పీవోను ఆదేశించినట్లు తెలిపారు. సోమవారం నుంచి ఉపాధ్యాయుడు అందుబాటులో ఉంటారని చెప్పారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
Similar News
News February 11, 2026
జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News February 11, 2026
ఏకాదశి: ఎల్లుండి ఉపవాసం ఉంటున్నారా?

ఏకాదశికి చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే ఆ ఒక్కరోజే కాకుండా మూడ్రోజులు (ఏకాదశి, దశమి, ద్వాదశి) కలిపి ‘హరిత్రయం’ పాటిస్తూ ఉపవాసం ఉండాలంటున్నారు పండితులు. దీనివల్ల అధిక పుణ్యం లభిస్తుందట. నియమాలు.. దశమి నాడే ఉపవాస నియమాలు ప్రారంభించాలి. దశమి రాత్రి అల్పాహారం తీసుకుని, నేలపై పడుకోవాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ ఆధ్యాత్మిక చింతనలో గడపాలి. ద్వాదశి ఘడియలు ముగిసేలోపే వ్రత సమాప్తి (పారణ) చేయాలి.
News February 11, 2026
SEBI 91 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (<


