News November 9, 2024

విద్యార్థుల నిరసనపై స్పందించిన మంత్రి

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జోడూరు పాఠశాలలో గిరిజన విద్యార్థులు తమకు టీచర్ కావాలంటూ <<14563913>>నిరసన<<>> వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. టీచర్‌ను నియమించాలని ఐటీడీఏ పీవోను ఆదేశించినట్లు తెలిపారు. సోమవారం నుంచి ఉపాధ్యాయుడు అందుబాటులో ఉంటారని చెప్పారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

Similar News

News December 6, 2024

రోదసిలో నడవనున్న సునీతా విలియమ్స్

image

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది రోదసిలో నడవనున్నారు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లను ఆమె సిద్ధం చేసుకుంటున్నారు. సూట్స్‌లో డేటా రికార్డర్ బాక్స్, ఆక్సిజన్ పనితీరు వంటివాటిపై ఆమె పనిచేస్తున్నారని నాసా తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమె భూమికి తిరిగిరానున్నారు. వారం రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె సాంకేతిక కారణాలతో 6 నెలలకు పైగా అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే.

News December 6, 2024

పుష్ప-2 డైలాగ్స్.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు

image

అల్లు రామలింగయ్య, మెగాస్టార్ కుటుంబాలు రెండు కాదు ఒక్కటేనని ఏపీ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు. వాళ్లు స్వయంకృషితో ఎదిగారు తప్ప కుటుంబం పేరు వాడుకోలేదన్నారు. ఇప్పుడు పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగులకు పెడార్థాలు తీసి అభిమానుల్లో అగ్గి రాజేసే పనిలో వైసీపీ శ్రేణులు, పెయిడ్ ఎనలిస్టులు ఉన్నారని ఆరోపించారు. సినిమాను సినిమాగానే చూడాలని, వారి ట్రాప్‌లో పడొద్దని సూచించారు.

News December 6, 2024

అంబేడ్కర్ కీర్తిని చాటేందుకు కృషి చేశాం: KCR

image

TG: అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా BRS అధినేత KCR ఆయన సేవలను స్మరించుకున్నారు. ‘సమసమాజ నిర్మాణ దార్శనికుడు అంబేడ్కర్. వివక్షకు వ్యతిరేకంగా జీవితకాలం పోరాడారు. ఆయన కీర్తిని ప్రపంచానికి చాటేందుకు కృషి చేశాం. అణగారిన వర్గాలకు సమన్యాయం దక్కేలా అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిది. ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 తెలంగాణ ఏర్పాటుకు మార్గం చూపింది’ అని KCR గుర్తుచేసుకున్నారు.