News July 20, 2024

మాంత్రికుడి దుశ్చర్య.. యువతి తలలోకి 22 సూదులు!

image

అనారోగ్యంతో ఉన్న ఓ యువతి తలలోకి మాంత్రికుడు 22 సూదులు గుచ్చాడు. ఈ ఘటన ఒడిశాలోని సింధికేళాలో జరిగింది. రేష్మ అనే యువతి తరచూ అనారోగ్యానికి గురవుతోంది. దీంతో ఆమె తండ్రి విష్ణు బెహరా మాంత్రికుడు తేజ్ రాజ్ దగ్గరికి తీసుకెళ్లారు. అతడు చికిత్స నెపంతో ఆమె తలలోకి 22 సూదులు గుచ్చాడు. నొప్పితో విలవిల్లాడిపోయిన రేష్మను ఆస్పత్రికి తరలించగా 8 సూదులు బయటికి తీశారు. పోలీసులు నిందితుడు తేజ్‌ను అరెస్ట్ చేశారు.

Similar News

News December 11, 2024

55 రోజుల్లో రూ.4,677 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరు అందుకున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ 9 వరకు రూ.4,677 కోట్ల విలువైన మద్యం వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇందులో 61.63 లక్షల కేసుల మద్యం, 19.33 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్లు పేర్కొంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 3,300 లిక్కర్ షాపులు ఏర్పాటైన సంగతి తెలిసిందే.

News December 11, 2024

మోహన్ బాబు ఇంట్లోనే మనోజ్.. ఏం జరగనుంది?

image

TG: శంషాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోనే మంచు మనోజ్, మౌనిక దంపతులు ఉన్నారు. మనోజ్ అక్కడే ఉంటారా? వెళ్లిపోతారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అస్వస్థతకు గురి కావడంతో మోహన్ బాబును మంచు విష్ణు ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో విష్ణు తిరిగి జల్‌పల్లికి వస్తే మళ్లీ గొడవ ఏమైనా జరుగుతుందా అనే టెన్షన్ నెలకొంది. అటు మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

News December 10, 2024

టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్: ఛైర్మన్

image

AP: భక్తుల పట్ల టీటీడీ ఉద్యోగులు బాధ్యత, అంకితభావంతో పనిచేసేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ‘కొందరు ఉద్యోగులు భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులందరికీ త్వరలోనే నేమ్ బ్యాడ్జ్ అందిస్తాం. దీని ద్వారా అమర్యాదగా వ్యవహరించే ఉద్యోగులను భక్తులు గుర్తించే అవకాశం ఉంటుంది’ అని Xలో బీఆర్ నాయుడు పోస్ట్ చేశారు.