News January 21, 2025
ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన కుక్క జాతులు

1. కేన్ కోర్సో (ఇటాలియన్ జాతి) డాగ్‌ను చాలా దేశాల్లో నిషేధించారు.
2. చెకోస్లోవాక్ వోల్ఫ్ డాగ్ (భయం లేనిది, వేగం, శక్తిగలది)
3. కానరియా డాన్ (చాలా దేశాల్లో బ్యాన్ చేశారు)
4.రోట్వీలర్ (అపరిచితులకు చుక్కలు చూపిస్తుంది)
5. బండోగ్ (నిషేధించిన జాతుల్లో ఒకటి)
6. పెర్రో డి ప్రెస్ మల్లోర్క్విన్ (తెలివైనది, శక్తివంతమైనది)
7. మాస్టిఫ్ (ఓనర్స్‌తో మాత్రమే ఫ్రెండ్లీగా ఉంటాయి)
Similar News
News February 8, 2025
కేన్ విలియమ్సన్ మరో ఘనత

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మరో ఘనత అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టు, వన్డే, టీ20లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన 17వ ఆటగాడిగా కేన్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 18,685 పరుగులు సాధించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా (18,672) రికార్డును చెరిపేశారు. పాక్‌తో జరుగుతున్న వన్డేలో కేన్ ఈ ఫీట్ సాధించారు. ఈ జాబితాలో సచిన్ (34,357) అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు.
News February 8, 2025
ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకం: చంద్రబాబు

AP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం చరిత్రాత్మకమని సీఎం చంద్రబాబు అన్నారు. మోదీపై నమ్మకంతోనే ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించారని చెప్పారు. ‘ఢిల్లీలో రాజకీయ, వాయుకాలుష్యాన్ని ఆప్ సర్కార్ పట్టించుకోలేదు. చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ సమస్య నుంచి బీజేపీ గట్టెక్కిస్తుందని ప్రజలు నమ్మారు. భారత్‌కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు మోదీ’ అని ఆయన పేర్కొన్నారు.
News February 8, 2025
లా సెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

TG: లా సెట్, ఈసెట్ పరీక్షలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 25న నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి. మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు ఈసెట్, మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు లాసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 12న ఈసెట్, జూన్ 6న లాసెట్ పరీక్ష జరగనుంది.