News February 17, 2025
చనిపోతూ ఆరుగురికి జీవితాన్నిచ్చిన ‘అమ్మ’

పెళ్లయిన 8 ఏళ్లకు పుట్టిన బిడ్డను కళ్లారా చూడకుండానే చనిపోయిందో మహిళ. తర్వాత అవయవదానం చేసి పలువురిలో సజీవంగా నిలిచిపోయిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఆషితా(38) ఈ నెల 7న బ్రెయిన్ స్ట్రోక్‌తో స్పృహ కోల్పోయారు. వైద్యులు సిజేరియన్ చేసి మగ బిడ్డను బయటకు తీశారు. FEB 13న ఆమె బ్రెయిన్ డెడ్ అవడంతో 2 కిడ్నీలు, 2 కార్నియాలు, కాలేయాన్ని భర్త దానం చేశారు. దీంతో సొంత బిడ్డతో సహా ఆరుగురికి జీవితాన్నిచ్చినట్లయ్యింది.
Similar News
News March 19, 2025
పలు పదవులకు SEC నోటిఫికేషన్

AP: మండల ప్రజా పరిషత్, 2 జిల్లా పరిషత్‌లు, పంచాయతీల్లో ఖాళీలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గ్రామ పంచాయతీల్లో 214 ఉప సర్పంచ్‌లు, వైఎస్సార్ ZP ఛైర్‌పర్సన్, కర్నూలు ZP కోఆప్టెడ్ మెంబర్, MPPలలో 28 ప్రెసిడెంట్స్, 23 వైస్ ప్రెసిడెంట్స్, 12 కోఆప్టెడ్ మెంబర్ ఖాళీలున్నాయి. ఈ నెల 23లోగా సంబంధిత మెంబర్లకు నోటీసులు జారీ చేస్తామని, 27న ఎన్నిక నిర్వహిస్తామని SEC తెలిపింది.
News March 19, 2025
నాకు రక్షణ కల్పించండి: వివేకా హత్య కేసు నిందితుడు

AP: వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ కడప SPని కలిసి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ హత్య కేసులో నిందితులు జైల్లో నన్ను బెదిరించారు. నేను మాట్లాడే విషయాలు కొందరికి నచ్చట్లేదు. వైసీపీకి చెందిన కొందరు నన్ను బెదిరిస్తున్నారు. ‘హత్య’ సినిమాలో నన్ను క్రూరంగా చిత్రీకరించారు. ఆ మూవీలో నలుగురే చంపినట్లు చూపించారు. 8మందిని ఎందుకు చూపించలేదు?’’ అని ప్రశ్నించారు.
News March 19, 2025
రేవంత్‌పై నమోదైన కేసు కొట్టివేత

TG: గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. 2020 మార్చిలో జన్వాడలో డ్రోన్ ఎగురవేశారని రేవంత్‌తో సహా పలువురిపై రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పీఎస్‌లో కేసు నమోదైంది. అలాగే రేవంత్‌ను కించపరిచే విధంగా మాట్లాడారని సైఫాబాద్ పీఎస్‌లో కేటీఆర్‌పై నమోదైన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది.