News October 16, 2024

దర్యాప్తు జరుగుతుండగా రిజైన్ చేసిన ముడా చీఫ్

image

ముడా స్కామ్‌ కేసుపై వేగంగా దర్యాప్తు జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ చీఫ్ మారిగౌడ అనారోగ్య కారణాలతో పదవికి రిజైన్ చేశారు. ముడాలో భూముల సేకరణ, పంపిణీలో ఆయనే కీలకంగా వ్యవహరించారు. మైసూరులో అక్రమంగా 14 ప్లాట్లు పొందారన్న ఆరోపణలతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, అతడి భార్య పార్వతి, బావమరిదిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌పై లోకాయుక్త, ED వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి.

Similar News

News November 24, 2025

ఫ్లైట్‌లో ఈ 10 వస్తువులు నిషేధం అని తెలుసా?

image

విమాన ప్రయాణాలు చేసేవారు ఈ 10 వస్తువులను క్యారీ చేయకూడదు. కొబ్బరికాయ, కేన్డ్‌ ఫుడ్‌ను ఫ్లైట్‌లో తీసుకెళ్లకూడదు. అధిక పీడనం కారణంగా అవి పగిలిపోయే ప్రమాదం ఉంది. కొబ్బరి ముక్కలు, తురుము తీసుకెళ్లవచ్చు. సాఫ్ట్ చీజ్, విత్తనాలు, ప్రొటీన్ పౌడర్, దురియన్ ఫ్రూట్, నిషేధ రసాయనాలతో తయారు చేసిన మందులు, గ్లో స్టిక్స్, టాయ్ వెపన్స్, స్నో గ్లోబ్స్‌‌ను విమానాల్లో తీసుకెళ్లడంపై నిషేధం అమలులో ఉంది.

News November 24, 2025

బిడ్డ ఆరోగ్యానికి పునాది అక్కడే..

image

తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడే పేగుల్లో మంచి బ్యాక్టీరియాతో కూడిన ‘మైక్రో బయోమ్‌’ పెరగడం ఆరంభమవుతుంది. గర్భిణి ఆరోగ్యకర ఆహారం తీసుకుంటే ఈ ‘గట్‌ మైక్రోబయోమ్‌’ తల్లి నుంచి శిశువుకు వస్తుంది. మనం పుట్టినప్పుడు ఉండే మైక్రోబయోమ్‌ స్థితి బట్టి.. మన జీవితం ఎంత సాఫీగా, ఆరోగ్యకరంగా ఉంటుందో చెప్పొచ్చంటున్నారు నిపుణులు. ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల వల్ల మైక్రో బయోమ్‌ మారి రకరకాల వ్యాధులు వస్తుంటాయి.

News November 24, 2025

ఐబొమ్మ రవి ఎలా చిక్కాడంటే?

image

ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. ఇప్పటివరకు అతడు వెబ్‌సైట్లకు సంబంధించి ఎలాంటి కీలక సమాచారం చెప్పలేదని తెలుస్తోంది. దీంతో కోర్టులో హాజరుపర్చి మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. ఇక రవి అరెస్టుపై కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. HYD వచ్చిన రవి ఫ్లాట్‌కు రమ్మంటూ తన ఫ్రెండ్‌‌కు మెసేజ్ చేశాడు. అప్పటికే ఫ్రెండ్ నంబర్ సంపాదించిన పోలీసులు మెసేజ్ రాగానే వెళ్లి రవిని అరెస్ట్ చేశారు.