News October 16, 2024

దర్యాప్తు జరుగుతుండగా రిజైన్ చేసిన ముడా చీఫ్

image

ముడా స్కామ్‌ కేసుపై వేగంగా దర్యాప్తు జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ చీఫ్ మారిగౌడ అనారోగ్య కారణాలతో పదవికి రిజైన్ చేశారు. ముడాలో భూముల సేకరణ, పంపిణీలో ఆయనే కీలకంగా వ్యవహరించారు. మైసూరులో అక్రమంగా 14 ప్లాట్లు పొందారన్న ఆరోపణలతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, అతడి భార్య పార్వతి, బావమరిదిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌పై లోకాయుక్త, ED వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి.

Similar News

News November 13, 2024

బ్రదర్.. ఇకనైనా లేచి పాదాలకు పనిచెప్పు!

image

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటే ప్రమాదకరమని తెలిసినా లేచి నడిచేందుకు కొందరు ఇష్టపడరు. ఇలా సుదీర్ఘంగా కూర్చొని పనిచేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 2 గంటల పాటు కుర్చీలో కూర్చోవడం సిగరెట్ తాగినంత హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే మధుమేహం, గుండె జబ్బులొస్తాయి. మెడ, వెనుక భాగంలో నొప్పి వస్తుంది. జీవక్రియ నెమ్మదిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పడిపోతుంది. SHARE IT

News November 13, 2024

బ్రేకప్‌తో కుంగిపోయా: రాశి ఖన్నా

image

తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యాక ఎంతో కుంగిపోయినట్లు హీరోయిన్ రాశి ఖన్నా తెలిపారు. తాను నటించిన ‘ది సబర్మతి రిపోర్టు’ ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘గతంలో నాకు ఓ లవ్ స్టోరీ ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల అతడితో బ్రేకప్ అయ్యింది. ఆ సమయంలో ఎంతో బాధపడ్డా.. కుంగిపోయా. ఆ తర్వాత ఆ బాధ నుంచి బయటపడి కెరీర్‌పై దృష్టి పెట్టా. ఇప్పుడు నా ఫ్యామిలీ, ఫ్రెండ్సే నాకు అండ’ అని ఆమె చెప్పుకొచ్చారు.

News November 13, 2024

మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ నేతల బస

image

TG: దమ్ముంటే మూసీ ఒడ్డున బస చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ నేపథ్యంలో టీబీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 16న 25 మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు బస చేయనున్నారు. ఆరోజు సా.4 గంటల నుంచి మరుసటి రోజు ఉ.8 గంటల వరకు అక్కడే ఉండనున్నారు. కాగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌లో భాగంగా పరీవాహక ప్రాంతాల ప్రజలను తరలిస్తుండటంపై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది.