News April 20, 2024
పొలిటికల్ టర్న్ తీసుకున్న యువతి హత్య

కర్ణాటకలో కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు నేహా హిరేమఠ్(23) <<13080714>>హత్య<<>> రాజకీయ రంగు పులుముకుంది. ఇది ‘లవ్ జిహాది’ పనేనని కేంద్రమంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను రాష్ట్రమంత్రి, కాంగ్రెస్ నేత పరమేశ్వర కొట్టిపారేశారు. ఫయాజ్‌ను నేహా దూరం పెట్టడంతోనే అతడు చంపేశాడని చెప్పారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించి, నేహాకు న్యాయం చేయాలని తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Similar News
News February 22, 2026
సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

చెన్నైలోని CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 3 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి M.Tech(ఫుట్‌వేర్ Engg.&మేనేజ్‌మెంట్, MSc (బయోటెక్నాలజీ/బయోసైన్స్/బయోకెమిస్ట్రీ) అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 16న రాత పరీక్ష, 18న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. NET/GATE అర్హత కలిగినవారు రాత పరీక్షకు హాజరుకానవసరం లేదు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: clri.org/
News February 22, 2026
11 సార్లు రామాయణాన్ని వీక్షించిన మహర్షి

కాకి ముఖం, మానవ శరీరంతో ఉండే కాగ్భుషుండి మహర్షి రామాయణాన్ని 11 సార్లు, భారతాన్ని 16 సార్లు వీక్షించారని పురాణాల వాక్కు. లోమశ మహర్షి శాపంతో ఈ రూపం పొందారట. రాముడిపై భక్తితో చిరంజీవిగా నిలిచారని చెబుతారు. జ్ఞాన సముపార్జనలో రూపం ముఖ్యం కాదని, అహంకారాన్ని వీడి రామనామాన్ని జపించడమే పరమార్థమని ఆయన వశిష్ఠ మహర్షికే బోధించారు. గరుత్మంతుడి సందేహాలను నివృత్తి చేస్తూ రామాయణ రహస్యాలను వివరించిన జ్ఞాని ఈయన.
News February 22, 2026
ఉద్యమానికి ఇక సెలవు!

వరుస ఎన్‌కౌంటర్లు, కీలక నేతల లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానం ముగింపు దశకు చేరింది. ఎర్రసైన్యం సుదీర్ఘ పోరాటానికి 2021లో ఆర్కే మరణంతో బీటలు వారాయి. తర్వాత హిడ్మా, నంబాల కేశవరావు లాంటి కీలక నేతలు హతమయ్యారు. మల్లోజుల, ఆశన్న, దేవ్‌జీ, రాజిరెడ్డి లొంగిపోయారు. గణపతి విదేశాలకు వెళ్లిపోగా, బడే చొక్కారావు కోసం వేట కొనసాగుతోంది. ప్రస్తుతం అడవుల్లో అతికొద్ది మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం.


