News August 18, 2024
సుప్రీంకోర్టుకు హత్యాచార ఘటన
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల రెసిడెంట్ డాక్టర్‌పై హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంగళవారం ఈ కేసుపై సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరపనుంది. ఆగస్ట్ 9న జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహాజ్వాలలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది.
Similar News
News September 18, 2024
నేడు NPS వాత్సల్య పథకం ప్రారంభం.. ప్రయోజనాలివే
బాల, బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించే NPS వాత్సల్య పథకం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. పిల్లల పేరుతో పేరెంట్స్/సంరక్షకులు ఈ ఖాతా తీసుకోవచ్చు. వారికి 18 ఏళ్లు నిండాక ఇది NPS అకౌంట్‌గా మారుతుంది. ఏడాదికి రూ.1,000 నుంచి ఎంతైనా జమ చేసుకోవచ్చు. ఏటా వడ్డీ జమవుతుంది. ఇందులో పెట్టుబడితో సెక్షన్ 8CCD(1B) కింద రూ.50వేల పన్ను మినహాయింపు ఉంటుంది. 60 ఏళ్లు వచ్చాక NPS నిధిలో 60% డబ్బులు ఒకేసారి తీసుకోవచ్చు.
News September 18, 2024
ఏపీలో టీచర్‌గా చేసిన ఢిల్లీ కొత్త సీఎం
ఢిల్లీ కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న ఆతిశీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. పాలిటిక్స్‌లోకి రాకముందు ఆమె టీచర్‌గా పనిచేశారు. ఏపీలోని మదనపల్లె సమీపంలోని రిషివ్యాలీ స్కూల్‌లో పిల్లలకు పాఠాలు చెప్పారు. ఆ తర్వాత 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ విద్యాశాఖ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాకు సలహాదారుగానూ వ్యవహరించారు. అనంతరం ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
News September 18, 2024
నేడు ఏపీ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం
AP: రాష్ట్రంలో నేడు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశముంది. MLAల పనితీరు, భవిష్యత్తు కార్యచరణపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.