News November 14, 2024

‘లాపతా లేడీస్’ పేరు మారింది.. ఎందుకంటే?

image

బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ 2023లో విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. భారత్ నుంచి 2025 ఆస్కార్ అవార్డులకు సైతం నామినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే దేశవిదేశాల్లో ఉన్న వారికి సులభంగా అర్థమయ్యేలా టైటిల్‌ను ‘లాస్ట్ లేడీస్’(Lost Ladies)గా మార్చేశారు. కాగా ఆస్కార్ వేడుక 2025 మార్చి 3న జరగనుంది.

Similar News

News December 12, 2025

ఘోరం.. బాలిక చెవి కొరుక్కుతిన్న కుక్క

image

AP: నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4 ఏళ్ల చిన్నారిపై వీధికుక్క పాశవికంగా దాడి చేసింది. ఆసియా అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా దాడి చేసి చెవిని కొరుక్కుతింది. చెంపతో పాటు ఇతర శరీర భాగాలపైనా తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
* పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి

News December 12, 2025

9 జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్

image

AP: VSP ఎకనామిక్ రీజియన్‌‌పై CM CBN సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలో ఉన్నాయి. APలో 31% విస్తీర్ణం, 23% జనాభాతో GDPలో 30% భాగస్వామ్యం VERదే. గ్లోబల్ పోర్ట్, నెక్ట్స్‌జెన్ ఐటీ, అగ్రికల్చర్, టూరిజం, హెల్త్ కేర్ వంటి 7 గ్రోత్ డ్రైవర్ల ద్వారా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

News December 12, 2025

హైదరాబాద్‌లో అఖిలేశ్.. రేవంత్, కేటీఆర్‌తో భేటీ

image

TG: యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రేవంత్ ఆయనకు వివరించారు. అటు BRS వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోనూ సమావేశమైన అఖిలేశ్ రాజకీయ పరిస్థితులపై చర్చించారు.