News November 14, 2024
‘లాపతా లేడీస్’ పేరు మారింది.. ఎందుకంటే?
బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ 2023లో విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. భారత్ నుంచి 2025 ఆస్కార్ అవార్డులకు సైతం నామినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే దేశవిదేశాల్లో ఉన్న వారికి సులభంగా అర్థమయ్యేలా టైటిల్‌ను ‘లాస్ట్ లేడీస్’(Lost Ladies)గా మార్చేశారు. కాగా ఆస్కార్ వేడుక 2025 మార్చి 3న జరగనుంది.
Similar News
News December 5, 2024
పుష్ప-2 REVIEW& RATING
పుష్ప-1లో ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్ అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరాడన్నదే కథ. జాతర సీక్వెన్స్, క్లైమాక్స్‌లో బన్నీ నటవిశ్వరూపం చూపించారు. శ్రీవల్లి నటన, ప్రీ ఇంటర్వెల్, సాంగ్స్ ప్లస్. సెకండాఫ్‌లో ఎమోషన్లకు పెద్దపీట వేసిన డైరెక్టర్ స్టోరీలో కీలకమైన స్మగ్లింగ్‌ను పక్కనబెట్టారు. సాగదీత సీన్లు, రన్‌టైమ్, విలనిజంలో బలం లేకపోవడం మైనస్. సుక్కు మార్క్ మిస్ అయింది.
RATING: 3/5
News December 5, 2024
నేడు విచారణకు రానున్న హరీశ్ రావు క్వాష్ పిటిషన్
TG: పంజాగుట్ట పీఎస్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి హరీశ్ రావు వేసిన క్వాష్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన అందులో పేర్కొన్నారు. కాగా ఎన్నికల సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను హరీశ్ రావు ట్యాప్ చేశారని సిద్దిపేటలో ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు.
News December 5, 2024
ఏపీలోనూ ఒక పాకిస్థాన్ ఉందని తెలుసా?
AP: రాష్ట్రంలోని విజయవాడలో పాకిస్థాన్ పేరుతో ఓ కాలనీ ఉంది. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. అదే సమయంలో పాక్, బంగ్లాదేశ్ విడిపోవడంతో ఇరు దేశాల సరిహద్దుల్లోని అనేక కుటుంబాలు నిరాశ్రయులు కావడంతో అప్పటి ప్రధాని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారికి ఆశ్రయం కల్పించారు. 1984లో నగరంలోని పాయకాపురం ప్రాంతంలో 40 ఇళ్లతో ఓ కాలనీ ఏర్పాటైంది. దానికి పాకిస్థాన్ కాలనీగా నామకరణం చేశారు.