News May 20, 2024
రాష్ట్రంలో రెండు జిల్లాల పేర్లు మార్పు!
TG: రాష్ట్రంలో రెండు జిల్లాలకు పేరు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును, ఉమ్మడి వరంగల్లోని ఏదైనా మరో జిల్లాకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. కాగా ఇప్పటికే టీఎస్ నుంచి టీజీగా మార్చుతూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News December 23, 2024
‘నో డిటెన్షన్’ విధానం రద్దు
స్కూళ్లలో ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరి పాస్ కావాలని పేర్కొంది. ఫెయిలైన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం ద్వారా ఈ విధానం అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లతో పాటు KVలు, నవోదయ, సైనిక్ స్కూళ్లకు ఇది వర్తించే అవకాశం ఉంది.
News December 23, 2024
ఖేల్రత్న జాబితా వివాదం: మనూభాకర్ పేరు డిలీట్?
మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు నామినీల జాబితాలో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూభాకర్ పేరు తొలగించినట్టు సమాచారం. కమిటీ ఆమె పేరును రికమెండ్ చేయలేదని తెలిసింది. వివాదం నెలకొనడంతో అవార్డుకు ఆమె దరఖాస్తు చేసుకోలేదని స్పోర్ట్స్ మినిస్ట్రీ చెప్తోంది. అది అవాస్తవమని, తాము చేశామని ఆమె తండ్రి రామకృష్ణ స్పష్టం చేశారు. అవార్డుల కోసం అడుక్కోవాల్సి వస్తే మెడల్స్ సాధించడంలో అర్థమేముందని ప్రశ్నించారు.
News December 23, 2024
ఆ లోపు అమరావతి టెండర్ల ప్రక్రియ పూర్తి: మంత్రి నారాయణ
AP: అమరావతిలో జోన్ 7, జోన్ 10 లేఅవుట్ల కోసం రూ.2,723 కోట్ల నిర్మాణ పనులకు సీఆర్డీఏ అంగీకారం తెలిపిందని మంత్రి నారాయణ అన్నారు. వచ్చే నెల 15 కల్లా రాజధాని నిర్మాణాల టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు. మొత్తం 7 లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం 2.61 లక్షల ఇళ్లు కూడా పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. జూన్ 12లోగా లక్షా 18వేల టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు.