News May 20, 2024
రాష్ట్రంలో రెండు జిల్లాల పేర్లు మార్పు!
TG: రాష్ట్రంలో రెండు జిల్లాలకు పేరు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును, ఉమ్మడి వరంగల్‌లోని ఏదైనా మరో జిల్లాకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. కాగా ఇప్పటికే టీఎస్ నుంచి టీజీగా మార్చుతూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News December 11, 2024
60 ఏళ్లలో వ్యాపారం స్టార్ట్ చేసి.. రూ.49వేల కోట్లకు!
ఒకప్పుడు సాధారణ ఉద్యోగ జీవితం గడిపిన లక్ష్మణ్ దాస్ మిట్టల్.. 60 ఏళ్ల వయసులో వ్యాపారాన్ని మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు. 1990లో LIC నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత సోనాలికా ట్రాక్టర్స్ గ్రూప్‌ను స్థాపించారు. తర్వాత కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో కలిసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రస్తుతం 94 సంవత్సరాల వయస్సులో రూ.49,110 కోట్లతో అత్యంత వృద్ధ బిలియనీర్‌గా ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
News December 11, 2024
SMAT సెమీస్ చేరిన జట్లివే..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT) తుది అంకానికి చేరింది. బరోడా, ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్ జట్లు సెమీస్‌లో అడుగుపెట్టాయి. ఎల్లుండి బరోడా-ముంబై, ఢిల్లీ-మధ్యప్రదేశ్ తలపడనున్నాయి. వీటిలో గెలిచిన జట్లు 15న ఫైనల్‌లో ఆడనున్నాయి. ఏ జట్లు ఫైనల్ చేరుతాయని భావిస్తున్నారో కామెంట్ చేయండి.
News December 11, 2024
ఈ విషయం మీకు తెలుసా?
రాజులు, యోధుల విగ్రహాలు చూసినప్పుడు వారు ఎలా చనిపోయారో చెప్పవచ్చు. ముఖ్యంగా గుర్రంపై యోధులు ఉన్న విగ్రహాలను బట్టి మరణానికి గల కారణాలు చెప్పొచ్చని పురాణ పండితులు చెబుతున్నారు. ‘విగ్రహంలోని గుర్రం రెండు కాళ్లు పైకి లేపి ఉంచితే యుద్ధభూమిలో చనిపోయినట్టు. ఒక కాలు పైకి లేపి, మరొకటి నేలపై ఉంచితే యుద్ధంలో గాయపడి తర్వాత మరణించినట్లు గుర్తు. ఇక రెండు కాళ్లు భూమిపై ఉంటే అనారోగ్యంతో చనిపోయినట్లు’ అని ప్రతీతి.