News August 16, 2024

కాసేపట్లో నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన

image

నేషనల్ ఫిల్మ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను కేంద్రం కాసేపట్లో ప్రకటించనుంది. ఉత్తమ నటుల కేటగిరీలో మమ్ముట్టి(నాన్‌పకల్ నెరత్తు మయక్కం), రిషభ్ శెట్టి(కాంతార), విక్రమ్(పొన్నియన్ సెల్వన్), విక్రాంత్ మాసే(12th ఫెయిల్) బరిలో నిలిచారు. విజేతలకు అక్టోబర్‌‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు అందజేస్తారు. కాగా పుష్ప మూవీలో నటనకుగానూ అల్లు అర్జున్‌ను గతేడాది జాతీయ అవార్డు వరించింది.

Similar News

News January 15, 2025

భారత మహిళా జట్టు విధ్వంసం.. 50 ఓవర్లలో 435 రన్స్

image

ఐర్లాండ్‌ మహిళా జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత్ విధ్వంసం సృష్టించింది. 50 ఓవర్లలో 435/5 స్కోర్ చేసింది. ప్రతికా రావల్(154), స్మృతి మంధాన(135) సెంచరీలతో చెలరేగగా, రిచా ఘోష్ 59, తేజల్ 28, హర్లీన్ 15 రన్స్ చేశారు. వన్డేల్లో టీమ్ ఇండియాకు ఇదే అత్యధిక స్కోర్. ఓవరాల్‌గా నాలుగో స్థానం. గతంలో కివీస్ ఉమెన్ 491/4, 455/5, 440/3 స్కోర్లు చేసి టాప్‌లో ఉంది.

News January 15, 2025

జుకర్‌బర్గ్ కామెంట్స్: మోదీ సర్కారుకు మెటా క్షమాపణ

image

మోదీ సర్కారుకు మెటా క్షమాపణ చెప్పింది. తమ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ పొరపాటున నోరు జారారని తెలిపింది. భారత్ తమకు అత్యంత కీలకమంది. రీసెంటుగా ఓ పాడ్‌కాస్టులో 2024 ఎన్నికల్లో భారత్ సహా అనేక దేశాల్లో అధికార పార్టీలు ఓడిపోయాయని మార్క్ అన్నారు. దీనిపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మండిపడ్డారు. IT పార్లమెంటరీ ప్యానెల్ హెడ్ MP నిశికాంత్ మెటా అధికారులను పిలిపిస్తామని హెచ్చరించారు. దీంతో సంస్థ దిగొచ్చింది.

News January 15, 2025

మంత్రి లోకేశ్‌ను కలిసిన మంచు మనోజ్

image

AP: నారావారిపల్లెలో హీరో మంచు మనోజ్ మంత్రి లోకేశ్‌ను కలిశారు. మనోజ్ ఇవాళ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలోకి వెళ్లాల్సి ఉండగా పోలీసులు అనుమతించలేదు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. దీంతో మనోజ్ తన భార్య మౌనికతో కలిసి నారావారిపల్లెకు వెళ్లి లోకేశ్‌తో భేటీ అయ్యారు. వారు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు.