News May 12, 2024
ఓల్డెస్ట్ మహిళా బిలియనీర్ సుబ్బమ్మ జాస్తి!

సువెన్ ఫార్మా కోఫౌండర్ వెంకటేశ్వర్లు జాస్తి తల్లి సుబ్బమ్మ(91) ఇండియాలో ఓల్డెస్ట్ మహిళా బిలియనీర్గా అవతరించారు. ఆమె ఆస్తి 1.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. HYDకు చెందిన ఈమె కుమారుడు వెంకటేశ్వర్లు 1970-80 మధ్య USలో 6 ఫార్మసీలను నడిపేవారు. 1989లో సువెన్ ఫార్మాను ప్రారంభించారు. గత ఏడాది FEBలో అతని తండ్రి సుబ్బారావు చనిపోవడంతో తల్లికి ఆస్తిలో వాటా లభించింది.
Similar News
News January 21, 2026
మేడారం.. నేడు ‘మండమెలిగే’ పండుగ

TG: మేడారం జాతరలో ‘మండమెలిగే’ ఘట్టం జరగనుంది. గ్రామంలోని సమ్మక్క ఆలయాన్ని, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాన్ని ఆదివాసీ పూజారులు పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. మేడారం వీధుల్లో, ఆలయ పరిసరాల్లో పచ్చని తోరణాలు కడతారు. దీంతో ఇవాళ రాత్రి దర్శనాలు నిలిపివేశారు. పూర్వం అగ్ని ప్రమాదాలతో దగ్ధమైన ఆలయ గుడిసెలను జాతరకు వారం ముందు కొత్త కొమ్మలతో శుద్ధి చేసి పునర్నిర్మించేవారు. దీంతో ‘మండమెలిగే’ అని పేరు వచ్చింది.
News January 21, 2026
భారత్ నుంచి వన్ప్లస్ ఔట్ అనే వార్తలపై క్లారిటీ

భారత్లో సేవలు నిలిపివేస్తున్నట్టు వస్తున్న వార్తలను మొబైల్ దిగ్గజం వన్ప్లస్ ఖండించింది. అవి ఫేక్ న్యూస్ అని, రూమర్లను నమ్మొద్దని చెప్పింది. ఇండియన్ మార్కెట్లో తమ సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. 2024లో సేల్స్ 20% పతనం, రిటైలర్ మార్జిన్స్ తగ్గుదల, లేఆఫ్స్ కారణంగా భారత్లో అన్ని రకాల సేవలను వన్ప్లస్ నిలిపివేయనుందనే రూమర్స్ వచ్చినట్టు తెలుస్తోంది.
News January 21, 2026
HYDలో లారియల్ తొలి గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్

ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మొటిక్ కంపెనీ లారియల్(L’Oréal) HYDలో తొలి గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు దావోస్ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో ఆ సంస్థ CEO నికోలస్ సమావేశమై చర్చించారు. నవంబర్లో జరిగే ప్రారంభోత్సవానికి CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానించారు. ఆవిష్కరణలు, టెక్నాలజీ, Ai డేటాకు ఇది కేంద్రంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో తయారీ కేంద్రం ఏర్పాటుకు సంస్థ ఆసక్తి చూపింది.


