News April 10, 2024
అత్యంత వృద్ధుడు మా దేశంలో ఉన్నాడు: పెరూ

వెనిజులకు చెందిన జువాన్ మోరా(114) మరణించడంతో బ్రిటన్‌కు చెందిన జాన్ టిన్నిస్‌వుడ్ (111) ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, టెన్నిస్‌వుడ్ కంటే ఎక్కువ వయసు కలిగిన వ్యక్తి తమ దేశంలో ఉన్నారని పెరూ ప్రతినిధులు పేర్కొన్నారు. హువానుకోలోని సెంట్రల్ పెరువియన్ ప్రాంతానికి చెందిన మార్సెలినో అబాద్ 1900లో జన్మించారు. ఆయన వయసు 124 ఏళ్లు. దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
Similar News
News March 24, 2025
ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ వర్సిటీ.. ఒప్పందం ఖరారు

AP: విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి లోకేశ్ చెప్పారు. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నెలకొల్పేందుకు జార్జియా నేషనల్ వర్సిటీ ముందుకొచ్చిందన్నారు. ₹1,300Cr పెట్టుబడి పెట్టనుందని, 500 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం, GNU మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపర్చడం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.
News March 24, 2025
కాంగ్రెస్ అధిష్ఠానంతో రాష్ట్ర నేతల భేటీ

కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలంగాణ నేతల సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. మంత్రి వర్గ విస్తరణ, రిజర్వేషన్ల అంశం, డీలిమిటేషన్ వంటి అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది.
News March 24, 2025
21 బంతుల్లో హాఫ్ సెంచరీ

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ వీర విహారం చేశారు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదారు. మరోవైపు పూరన్ సైతం ధాటిగా ఆడుతున్నారు. 7 ఓవర్లలో స్కోరు 89/1.