News February 10, 2025
13 ఏళ్లుగా ఒకే ఒక్కడు.. రోహిత్ శర్మ

ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు వరుసగా POTM అవార్డు అందుకున్న ప్లేయర్‌గా నిలిచారు. 2013 నుంచి 2025 వరకు ఏటా కనీసం ఒక మ్యాచ్‌లో అయినా హిట్‌మ్యాన్ ఈ అవార్డు అందుకుంటున్నారు. నిన్న ఇంగ్లండ్‌పై 90 బంతుల్లో 119 రన్స్ చేసిన రోహిత్ విమర్శకులకు బ్యాట్‌తో సమాధానం చెప్పిన విషయం తెలిసిందే.
Similar News
News March 19, 2025
టీచర్ల బదిలీల చట్టంతో చరిత్ర సృష్టించబోతున్నాం: లోకేశ్

AP: ఏపీ ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ బదిలీల చట్టం ఒక చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. ‘YCP ప్రభుత్వంలో అడ్డగోలుగా బదిలీలు జరిగాయి. అందరితో చర్చించాకే టీచర్ల బదిలీల చట్టం తీసుకొచ్చాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ఉంటుంది. టీచర్ల బదిలీల చట్టం ద్వారా మా ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోంది’ అని లోకేశ్ అన్నారు.
News March 19, 2025
బడ్జెట్‌లో పేజీలే పెరిగాయి.. సంక్షేమం కాదు: హరీశ్ రావు

TG: మహిళలను ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ‘బడ్జెట్‌లో అబద్ధాలు, అతిశయోక్తులే ఉన్నాయి. మహిళలకు రూ.5లక్షలు మాత్రమే వడ్డీలేని రుణం ఇస్తున్నారు. బడ్జెట్‌లో మాత్రం రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు. బడ్జెట్ పేజీలు పెరిగాయి తప్ప పేదలకు సంక్షేమం పెరగలేదు. మహిళలకు రూ.2,500 హామీ ఊసే లేదు. కానీ అందాల పోటీలకు రూ.250 కోట్లు బడ్జెట్‌లో పెట్టారు’ అని విమర్శించారు.
News March 19, 2025
IPL: కోహ్లీ బ్యాటింగ్.. సహచరుడు అంపైరింగ్

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చిన్ననాటి సహచరుడు తన్మయ్ శ్రీవాస్తవ IPLలో అంపైరింగ్ చేయనున్నారు. వీరిద్దరూ కలిసి 2008 అండర్-19 వరల్డ్ కప్‌లో ఆడారు. ఆ టోర్నీ ఫైనల్లో శ్రీవాస్తవ (46) టాప్ స్కోరర్. ఆయన IPL (PBKS తరఫున) కూడా ఆడారు. శ్రీవాస్తవ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికి అంపైరింగ్ చేస్తున్నా కోహ్లీ ఇంకా క్రికెటర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కోహ్లీ కెరీర్ పీక్స్‌లో ఉన్న విషయం తెలిసిందే.