News April 29, 2024

దేశ అభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ.. బీజేపీ: నడ్డా

image

TG: తమ పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని బీజేపీ చీఫ్ నడ్డా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సభలో తెలిపారు. ‘దేశ అభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ.. బీజేపీ. అయోధ్యలో వందల ఏళ్ల రామమందిర కలను సాకారం చేశాం. ఎంతో ధైర్యంతో ఆర్టికల్ 370 రద్దు చేశాం. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, అవినీతి. BRS పాలనలో అవినీతి పెచ్చుమీరితే.. ప్రస్తుతం కాంగ్రెస్‌ది అసమర్థ పాలన’ అని విమర్శించారు.

Similar News

News November 14, 2024

విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలి: CM

image

TG: కులగణనపై అపోహలు తొలగించే బాధ్యతను విద్యార్థులే తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఎవరు అడ్డుపడ్డా కులగణన ఆగదు. మీ తల్లిదండ్రులకు, చుట్టుపక్కలవారికి దీనిపై అవగాహన కల్పించాలి. దీనివల్ల 50శాతానికిపైగా రిజర్వేషన్లు వస్తాయి. విద్య, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలి’ అని ఎల్బీ స్టేడియంలో జరిగిన బాలల దినోత్సవంలో సీఎం పేర్కొన్నారు.

News November 14, 2024

ఓలాకు షాక్‌.. రంగంలోకి BIS

image

Ola Electric నాణ్య‌తా, స‌ర్వీసు ప్ర‌మాణాల లోపం ఆరోప‌ణ‌ల‌పై Bureau of Indian Standards విచారణ జరుపుతుందని వినియోగదారుల శాఖ అధికారి ఒకరు తెలిపారు. యూజర్ల నుంచి 10 వేల‌కుపైగా ఫిర్యాదులు అంద‌డంపై వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా CCPA గ‌తంలో నోటీసులు ఇచ్చింది. అయితే అవి కేవ‌లం సాఫ్ట్‌వేర్ వినియోగం అర్థంకాకపోవ‌డం, లూస్ పార్ట్స్ స‌మ‌స్య‌ల‌ని ఓలా పేర్కొంది. అయితే, దీనిపై విచార‌ణ బాధ్యత‌ను BISకు CCPA అప్ప‌గించింది.

News November 14, 2024

సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

image

TG: గురుకులాల్లో కల్తీ ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలపై CM రేవంత్ స్పందించారు. గురుకులాలకు నాసిరకం ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటివారు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో డైట్ ఛార్జీలు పెంచినట్లు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ స్కూల్స్‌ను సందర్శించాలని ఆదేశించారు.