News March 11, 2025
ఇక దూకుడే.. ప్రభుత్వంపై పోరాటమే: KCR

TG: BRS శాసనసభాపక్ష సమావేశంలో MLAలు, MLCలకు KCR దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. ‘ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలి. రైతు సమస్యలు, మంచినీటి కొరతపై సభలో గళం విప్పాలి. BC, SC రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలి. గురుకుల స్కూళ్లు, ఉద్యోగ సమస్యలు, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి’ అని KCR సూచించారు.
Similar News
News January 31, 2026
రాష్ట్రానికి నిధుల కోసం ఐక్యంగా పోరాడాలి: పొన్నం

TG: తెలంగాణ పుట్టుకనే PM మోదీ అవమానించారని, రాష్ట్రంపై చిన్నచూపు చూస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ 11 ఏళ్లుగా కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతోందన్నారు. ఈసారైనా RRR, మెట్రో, ఫ్యూచర్ సిటీకి నిధులు కేటాయించాలని కోరారు. విజన్ 2047కు అనుగుణంగా కేంద్రం మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం బీజేపీ సహా రాష్ట్ర ఎంపీలతో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
News January 31, 2026
కొర్ర పంటలో వెర్రి కంకి తెగులు నివారణ ఎలా?

ప్రస్తుతం తేమతో కూడిన వాతావరణం వల్ల కొర్ర పంటలో వెర్రి కంకి తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆకుల అడుగున బూజు లాంటి శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది. అలాగే మొక్క నుంచి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారతాయి. ఈ తెగులు నివారణకు కిలో విత్తనానికి రిడోమిల్ 3 గ్రాములను కలిపి విత్తనశుద్ధి చేయాలి. పంటలో తెలుగు లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి రిడోమిల్ 3గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News January 31, 2026
కుప్పంలో ప్రయోగం… రాష్ట్రమంతా అమలు: CM

AP: కుప్పం నియోజకవర్గం ఓ ప్రయోగశాల అని, ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతం చేసి రాష్ట్రమంతా అమలు చేస్తామని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘లక్షమందిని పారిశ్రామికవేత్తలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వన్ ఫ్యామిలీ వన్ ఆంత్రప్రెన్యూర్ ద్వారా దీన్ని అమలు చేస్తున్నాం. స్వర్ణాంధ్ర విజన్తో APని అగ్రస్థానంలో నిలబెడతాం. కుప్పం దానికి మొదటి మెట్టు. ఇక్కడ ₹7088 CRతో 16 పరిశ్రమలు వచ్చాయి’ అని వివరించారు.


