News March 11, 2025
ఇక దూకుడే.. ప్రభుత్వంపై పోరాటమే: KCR

TG: BRS శాసనసభాపక్ష సమావేశంలో MLAలు, MLCలకు KCR దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. ‘ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలి. రైతు సమస్యలు, మంచినీటి కొరతపై సభలో గళం విప్పాలి. BC, SC రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలి. గురుకుల స్కూళ్లు, ఉద్యోగ సమస్యలు, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి’ అని KCR సూచించారు.
Similar News
News March 19, 2025
IPL: మిడిలార్డర్‌లో KL బ్యాటింగ్?

ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న KL రాహుల్ బ్యాటింగ్ పొజిషన్‌పై చర్చ జరుగుతోంది. టీ20ల్లో ఓపెనర్‌గా ఆడే అతను ఈసారి టీమ్ కోసం మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. మెక్‌గుర్క్, డూప్లెసిస్ ఓపెనర్లుగా, అభిషేక్ పోరెల్ మూడో స్థానంలో, KL, అక్షర్, స్టబ్స్ మిడిలార్డర్‌లో ఆడతారని సమాచారం. DC తన తొలి మ్యాచును ఈనెల 24న వైజాగ్ వేదికగా LSGతో ఆడనుంది.
News March 19, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 19, బుధవారం ఫజర్: తెల్లవారుజామున 5.09 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.21 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు ఇష: రాత్రి 7.39 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.