News July 21, 2024

పలు అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాల పట్టు

image

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఢిల్లీలో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరిగింది. బీజేపీ నుంచి జేపీ నడ్డా, రాజ్‌నాథ్, టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి విజయసాయి, జనసేన నుంచి బాలశౌరి, BRS నుంచి సురేశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశాల్లో నీట్ వివాదం, మణిపుర్ హింస, ధరల పెరుగుదల, ED-CBIల దుర్వినియోగం సహా పలు అంశాలపై చర్చించాలని కాంగ్రెస్, SP డిమాండ్ చేశాయి.

Similar News

News December 27, 2025

TGTET హాల్ టికెట్లు విడుదల

image

TGTET హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. TETకు అప్లై చేసుకున్నవారు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జనవరి 3 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9గంటల నుంచి 11.30గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2గంటల నుంచి సా.4.30గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. వెబ్‌సైట్: https://tgtet.aptonline.in/

News December 27, 2025

VHT: రోహిత్‌, కోహ్లీల శాలరీ ఎంతంటే?

image

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతుండటంతో వారికి ఎంత శాలరీ వస్తుందన్న చర్చ జరుగుతోంది. లిస్ట్-A మ్యాచ్‌లు 40కు మించి ఆడిన సీనియర్ కేటగిరీ క్రికెటర్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.60K ఇస్తారు. రిజర్వ్‌లో ఉంటే రూ.30K చెల్లిస్తారు. కోహ్లీ, రోహిత్ సీనియర్ కేటగిరీ ప్లేయర్లే కాబట్టి రూ.60K చెల్లిస్తారు. IPLతో పోలిస్తే చాలా తక్కువే అయినా దేశవాళీ క్రికెట్‌లో ఇది మంచి ఫీజు అనే చెప్పుకోవచ్చు.

News December 27, 2025

యూరియా కష్టాలు.. చిన్న ఫోన్లలో యాప్ ఎలా?

image

తెలంగాణలో దాదాపు 60% రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో యూరియా కష్టాలు తప్పడం లేదు. వారి చిన్న ఫోన్ నంబర్లకే ఆధార్, భూముల వివరాలు లింకై ఉన్నాయి. ఫోన్ మార్చితే పథకాలు రద్దవుతాయని భయపడుతున్నారు. ఫలితంగా స్మార్ట్ ఫోన్ కొని యూరియా యాప్ డౌన్‌లోడ్ చేసుకోలేకపోతున్నారు. దళారులను ఆశ్రయిస్తున్నారు. దీనిపై అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.