News July 21, 2024
పలు అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాల పట్టు
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఢిల్లీలో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరిగింది. బీజేపీ నుంచి జేపీ నడ్డా, రాజ్‌నాథ్, టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి విజయసాయి, జనసేన నుంచి బాలశౌరి, BRS నుంచి సురేశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశాల్లో నీట్ వివాదం, మణిపుర్ హింస, ధరల పెరుగుదల, ED-CBIల దుర్వినియోగం సహా పలు అంశాలపై చర్చించాలని కాంగ్రెస్, SP డిమాండ్ చేశాయి.
Similar News
News December 10, 2024
మోహన్ బాబును అరెస్ట్ చేయాలి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ
మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ట్వీట్ చేశారు. అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధిపై దాడి సిగ్గు చేటు, అమానుషమని అన్నారు. అంతకుముందు తన ఇంటి వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దుర్భాషలాడుతూ, దాడికి పాల్పడ్డారు. మరోవైపు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
News December 10, 2024
రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?
ప్రస్తుత బిజీ లైఫ్‌లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.
News December 10, 2024
అమెరికా వారికి ఆశ్రయం: భారత్
భారత్‌కు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ప్రతి ముగ్గురు నేరస్థులు, ఉగ్రవాదుల్లో ఒకరు అమెరికాలో తలదాచుకుంటున్నారని, ఆగ్రరాజ్యం వారికి ఆశ్రయంగా మారిందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. వీరి అప్పగింత కోసం భారత దర్యాప్తు సంస్థలు చేసిన 178 పెండింగ్ అభ్యర్థనల్లో 65 ప్రస్తుతం US ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలిపింది. 2002-18 మధ్య 11 అభ్యర్థనలకే US సమ్మతించినట్టు పేర్కొంది.