News November 15, 2024

యజమాని సగం ముఖాన్ని పీకేసిన కుక్క!

image

పెంపుడు శునకాల్లో పిట్ బుల్ కుక్కల్ని అత్యంత ప్రమాదకరమైనవిగా చెబుతుంటారు. అది మరోసారి నిరూపితమైంది. బరేలీకి చెందిన ఆదిత్య శంకర్ అనే వ్యక్తి పిట్‌బుల్‌ను పెంచుకుంటున్నారు. తాజాగా ఆ కుక్క అతడిపై దాడికి పాల్పడింది. పెదాలు, సగానికి పైగా ముఖాన్ని పీకేసింది. కుటుంబీకులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా వైద్యులు సర్జరీ చేశారు. కుక్కను జంతు సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు మునిసిపల్ అధికారులు తెలిపారు.

Similar News

News November 15, 2024

కార్యసాధకుడికి వయసు అడ్డు కాదు

image

ఎదిగేందుకు, లక్ష్యాలను సాధించేందుకు వయసు అన్న పదం అడ్డు కాకూడదు. ఇంకే చేయగలంలే అంటూ డీలా పడకూడదు. KFCని శాండర్స్ తన 62వ ఏట మొదలుపెట్టారు. పోర్షేను ఫెర్డినాండ్ 56వ ఏట, స్టార్ బక్స్‌ను గోర్డన్ తన 51వ ఏట, వాల్‌మార్ట్‌ను శామ్ వాల్టన్ 44వ ఏట, కోకాకోలాను ఆసా కాండ్లర్ 41వ ఏట ప్రారంభించారు. సాధించాలన్న తపన, సాధించగలమన్న నమ్మకమే వీరిని విజయతీరాలకు చేర్చాయి.

News November 15, 2024

భారీ జీతంతో SI, కానిస్టేబుల్ ఉద్యోగాలు

image

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) టెలికమ్యూనికేషన్ విభాగంలో 526 ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి DEC 14 వరకు మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సై పోస్టులకు 20-25 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్లు ఉండాలి. ఎస్సైల పే స్కేల్ రూ.35,400-1,12,400, హెడ్ కానిస్టేబుల్ పే స్కేల్ రూ.25,500-81,100గా ఉంది. సైట్: recruitment.itbpolice.nic.in

News November 15, 2024

మా రిలీజ్‌లు ఉన్నప్పుడే సెంటిమెంట్ మాటలు: నాగవంశీ

image

తమ సినిమాలు వస్తున్నప్పుడే పోటీ సినిమాలు సెంటిమెంట్ కార్డ్ ప్లే చేస్తుంటాయని నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించారు. ‘మా సినిమాలకు పోటీగా విడుదల చేసే సినిమావాళ్లే తమ కష్టాలు, కన్నీళ్లు గురించి చెబుతుంటారు. మేం రిలీజ్ పెట్టుకున్నప్పుడే ఇలాంటివి ఎందుకు జరుగుతాయో మరి! ఇకపై మేము కూడా సింపతీ మాటలు చెప్పాలేమో’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’కు పోటీగా హనుమాన్ విడుదలైన సంగతి తెలిసిందే.