News November 15, 2024
యజమాని సగం ముఖాన్ని పీకేసిన కుక్క!

పెంపుడు శునకాల్లో పిట్ బుల్ కుక్కల్ని అత్యంత ప్రమాదకరమైనవిగా చెబుతుంటారు. అది మరోసారి నిరూపితమైంది. బరేలీకి చెందిన ఆదిత్య శంకర్ అనే వ్యక్తి పిట్‌బుల్‌ను పెంచుకుంటున్నారు. తాజాగా ఆ కుక్క అతడిపై దాడికి పాల్పడింది. పెదాలు, సగానికి పైగా ముఖాన్ని పీకేసింది. కుటుంబీకులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా వైద్యులు సర్జరీ చేశారు. కుక్కను జంతు సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు మునిసిపల్ అధికారులు తెలిపారు.
Similar News
News November 19, 2025
హిడ్మా ఎన్‌కౌంటర్‌లో ఏపీ పోలీసుల సక్సెస్

ఛత్తీస్‌గఢ్‌లో జన్మించిన హిడ్మాకు దక్షిణ బస్తర్ ప్రాంతంలో గట్టి పట్టు ఉండేది. చాలాసార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. ఇతడిని అంతం చేస్తే చాలు మావోయిజం అంతం అవుతుందని పోలీసులు భావించేవారు. కొన్ని నెలలుగా వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సేఫ్ కాదని భావించిన హిడ్మా.. ఏపీవైపు వచ్చాడని తెలుస్తోంది. గత నెల నుంచే అతడిపై నిఘా వేసిన ఏపీ పోలీసులు పక్కా వ్యూహంతో హిడ్మాపై దాడి చేశారు.
News November 19, 2025
నేడే PM కిసాన్ 21వ విడత డబ్బుల జమ

PM కిసాన్ 21వ విడత నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. రబీ పంట పెట్టుబడి సాయం కింద దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున ప్రధాని మోదీ జమ చేయనున్నారు. 2019 FEB-24న PM కిసాన్ ప్రారంభించగా ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనం అందనుంది.
News November 19, 2025
సూర్యాపేట జిల్లా వాసికి అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యా విభాగానికి చెందిన డా.రావుల కృష్ణయ్య పరిశోధక విద్యార్థిని సాక్షి సంయుక్తంగా చేసిన పరిశోధనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వారు రూపొందించిన పరిశోధనా పత్రం, జర్మన్ కమిషన్ ఫర్ యునెస్కో, జర్మన్ రెక్టర్స్ కాన్ఫరెన్స్ సంయుక్తంగా జర్మనీలోని హానోవర్‌లో నవంబర్ 19-21 మధ్య నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో సమర్పణకు ఎంపికైంది.


