News October 2, 2024
చెత్తలో దొరికిన పెయింటింగ్.. విలువ రూ.46 కోట్లు!
62 ఏళ్ల క్రితం ఇటలీలోని ఓ ఇంటిని కొన్న వ్యక్తి చెత్తను శుభ్రం చేస్తుండగా ఓ పెయింటింగ్ దొరికింది. అదేదో పిచ్చి బొమ్మ అనుకుని పక్కన పెట్టేశారు. ఇన్ని దశాబ్దాల తర్వాత ఆ యజమాని కుమార్తె దాన్ని పికాసో కళాఖండంగా గుర్తించారు. అనంతరం దాని విలువ రూ.46 కోట్లని తెలిసి షాకయ్యారు. ప్రస్తుతం దాన్ని ఓ లాకర్‌లో భద్రపరిచామని, ఏం చేయాలన్నదానిపై పికాసో ఫౌండేషన్‌తో మాట్లాడుతున్నామని వారు తెలిపారు.
Similar News
News October 11, 2024
నందిగం సురేశ్‌కు అస్వస్థత
AP: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. లో బీపీ, భుజం, ఛాతీలో నొప్పి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో జైలు అధికారులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్‌కు న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
News October 11, 2024
డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేజ్రీవాల్
అధికారంలోకొస్తే ఏడాదిలోపు విద్యుత్ ఛార్జీలను సగానికి తగ్గిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై EX CM కేజ్రీవాల్ స్పందించారు. ‘ఉచితాలు అమెరికా వరకు చేరుకున్నాయి’ అని ట్వీట్ చేశారు. అయితే, NDA పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమలు చేస్తే BJP తరఫున ప్రచారం చేస్తానని కేజ్రీవాల్ ఇటీవల సవాల్ విసిరారు. తాజాగా ట్రంప్ ప్రకటనపై స్పందించడం వెనుక ఆయన BJPని టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.
News October 11, 2024
జపాన్ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం
2024 ఏడాదికి గానూ నోబెల్ శాంతి బహుమతి జపనీస్ సంస్థ నిహాన్ హిడాంక్యోను వరించింది. అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్టు కమిటీ ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 111 మంది సభ్యులు, 31 సంస్థలను నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈ ఏడాది పురస్కారానికి 286 నామినేషన్లను పరిశీలించిన కమిటీ నిహాన్ హిడాంక్యోను పురస్కారానికి ఎంపిక చేసింది.