News June 11, 2024
నం.1 ర్యాంక్ కోల్పోయిన సాత్విక్-చిరాగ్ జోడీ

భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్-చిరాగ్ నం.1 ర్యాంకును కోల్పోయింది. సింగపూర్ ఓపెన్‌లో ఓటమి, ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలగడంతో తాజాగా ప్రకటించిన BWF ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన లియాంగ్, వాంగ్ చాంగ్ జోడీ తొలి స్థానం దక్కించుకుంది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో సింధు 10వ ర్యాంకులో కొనసాగుతున్నారు. ఇక పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ 10వ, లక్ష్య సేన్ 14వ ర్యాంకులో నిలిచారు.
Similar News
News March 26, 2025
PM కిసాన్ అనర్హుల నుంచి రూ.416 కోట్లు రికవరీ: కేంద్రం

పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిపొందిన అనర్హుల నుంచి ఇప్పటివరకు రూ.416 కోట్లు తిరిగి వసూలు చేసినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో వెల్లడించారు. ఈ స్కీమ్‌లో భాగంగా ఇప్పటివరకు 19 విడతల్లో రూ.3.68 కోట్లకు పైగా రైతులకు అందించినట్లు తెలిపారు. ఆధార్, ఐటీ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న సమాచారంతో అనర్హులను ఏరివేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 26, 2025
IPL: నేడు రాయల్స్‌తో రైడర్స్ ఢీ

ఐపీఎల్-2025లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. గువహటిలో రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు 28 మ్యాచుల్లో తలపడగా, చెరో 14 విజయాలు సాధించాయి. ఈ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన ఈ రెండు జట్లు ఇవాళ గెలిచి పాయింట్ల ఖాతా తెరవాలని చూస్తున్నాయి. ఈ మ్యాచులోనూ శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే ఛాన్సుంది. ఇవాళ గెలిచేదెవరో కామెంట్ చేయండి.
News March 26, 2025
ఈనెల 28న ప.గో జిల్లాలో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం మొగల్తూరులో, సాయంత్రం పెనుగొండలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాలు, అన్ని శాఖల అధికారులతో సమావేశమై గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై చర్చిస్తారు. పవన్ కళ్యాణ్ కుటుంబ మూలాలు మొగల్తూరులో ఉన్న సంగతి తెలిసిందే.