News March 19, 2024
పార్టీ మారడం లేదు.. బీఆర్ఎస్లోనే ఉంటా: ఎర్రబెల్లి
TG: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించారు. ‘నేను పార్టీ మారడం లేదు. బీజేపీలోకి వెళ్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా ప్రయత్నిస్తున్నారు. క్యాడర్ అవన్నీ నమ్మవద్దు. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తా’ అని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News October 31, 2024
రోడ్లపై బాణసంచా పేల్చడం నిషేధం
TG: దీపావళి సందర్భంగా పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం నిషేధమని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పేల్చాలని చెప్పారు. ఆ తర్వాత పేల్చినవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారీ శబ్దంతో పేలే టపాసులను కాల్చడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ నిబంధనలు నేటి నుంచి వచ్చే నెల 2 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
News October 31, 2024
జుట్టు, చర్మం, గోళ్లను అందంగా మార్చే ‘బయోటిన్’
ఆరోగ్యానికి ఆహారమే ప్రధానం. అందులోంచే శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ అందుతాయి. పొల్యూషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ సహా అనేక కారణాలతో జుట్టు ఊడిపోతుంది. గోళ్లు పెళుసుగా మారతాయి. చర్మం నిగారింపు కోల్పోతుంది. బయోటిన్ ఈ మూడింటినీ పరిష్కరిస్తుందని స్టడీస్ పేర్కొంటున్నాయి. ప్రతిరోజూ విటమిన్ సీ, జింక్తో కలిపి దేహానికి బయోటిన్ అందేలా మీల్స్ ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నాయి.
News October 31, 2024
కర్రలతో కొట్టుకొనే స్థితి నుంచి స్వీట్లు తినిపించుకొనే స్థాయికి..
భారత్, చైనా దౌత్యనీతిలో టెక్టానిక్ షిఫ్ట్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక కలవడం కష్టమే అనుకుంటే మిత్రబంధం ఒక్కసారిగా మెరుగైంది. కొవిడ్ టైమ్లో గల్వాన్లో చైనీయులను భారత జవాన్లు తరిమికొట్టారు. పిడిగుద్దులు, కర్రలు, రాడ్లతో చుక్కలు చూపించారు. ఇప్పుడు డిస్ఎంగేజ్మెంట్ ఒప్పందం కుదరడంతో స్వీట్లు తినిపించి జైశ్రీరామ్ అనిపించారు. భారత్ ఇదే ధోరణిలో సరిహద్దు సమస్యను పూర్తిగా పరిష్కరించుకోనుందా? మీ కామెంట్.