News April 20, 2024
ఈ తెగ ప్రజలు మొదటిసారి ఓటేశారు

దేశంలో నిన్న లోక్‌సభ తొలి విడత ఎన్నికలు జరిగిన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అండమాన్ & నికోబార్ దీవుల్లో షొంపెన్ తెగకు చెందిన ఏడుగురు మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బూత్ వద్ద నిలబడి ఫొటోలకు పోజులిచ్చారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌లోనూ 56 గ్రామాల ప్రజలు మొదటిసారి ఓటు వేశారు. <<-se>>#Elections2024<<>>
Similar News
News April 11, 2026
చంద్రుడిపై ప్లాట్లు.. ₹100 కోట్లు సంపాదించిన రియల్టర్

ఆర్టెమిస్-2 వ్యోమగాములు భూమికి తిరిగొచ్చిన వేళ చంద్రుడిపై ప్లాట్లు అమ్మే డెన్నిస్ హోప్ వార్త వైరలవుతోంది. 1980లో అంతర్జాతీయ చట్టాల్లోని లొసుగులను వాడుకుని చంద్రుడిని తన ఆస్తిగా ప్రకటించుకున్నారాయన. ఇప్పటి వరకు 70 లక్షల మందికి పైగా భూములు అమ్మి ₹100 కోట్లకు పైగా సంపాదించారు. సెలబ్రిటీలు సైతం ఇక్కడ ఎకరాల కొద్దీ కొనేసినట్లు టాక్. చట్టబద్ధత లేకపోయినా ఈ ‘మూన్ రియల్ ఎస్టేట్’ హాట్ టాపిక్‌గా మారింది.
News April 11, 2026
వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే..

వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే శరీరానికి చలువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘ఇది శరీర వేడిని తగ్గించి హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పరగడుపున తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది’ అని అంటున్నారు. ‘రోజుకు 50-120ml మాత్రమే తీసుకోవాలి. జెల్‌ను నీటితో కడిగి మిక్సీలో వేసి నీరు, నిమ్మరసం/తేనె కలుపుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News April 11, 2026
350 బ్యాంక్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇండియన్ బ్యాంక్ 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీ, ఫైనాన్స్, మార్కెటింగ్, క్రెడిట్, రిస్క్, HRలో అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్‌తో భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. చివరి తేదీ ఏప్రిల్ 28. బీటెక్, MCA, MBA, CA, ఏదైనా పీజీ చేసి ఉండాలి. మరిన్ని వివరాలకు https://indianbank.bank.in/career/ చూడండి.


