News August 3, 2024

లక్ష్యసేన్‌తో పోరాడిన ప్లేయర్‌కు క్యాన్సర్.. కానీ!

image

పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్‌ చేతిలో ఓడిన చైనా ఆటగాడు చౌ టియెన్ చెన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కొలొరెక్టల్ క్యాన్సర్‌కు ఆయన గతేడాది చికిత్స తీసుకున్నారు. కానీ ఈ విషయాన్ని టియెన్ ఎక్కడా బయటపెట్టలేదు. శరీరం అంతగా సహకరించపోయినా ఆయన ఒలింపిక్స్ బరిలో నిలిచారు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
<<-se>>#Olympics2024<<>>

Similar News

News September 19, 2024

ఈ ఫొటోలోని క్రికెటర్‌ను గుర్తు పట్టారా?

image

ఈ ఫొటోలో భారత క్రికెట్ గేమ్ ఛేంజర్ ఉన్నారు. ఆడిన తొలి రెండు టెస్టుల్లోనూ సెంచరీలు బాదారు. వన్డేల్లో 10 వేలకుపైగా పరుగులు, 100కుపైగా వికెట్లు, 100కుపైగా క్యాచ్‌లు పట్టారు. ఆయన నాయకత్వంలో వన్డే వరల్డ్ కప్ త్రుటిలో చేజారింది. 100కు పైగా టెస్టులు, 300కు పైగా వన్డేలు ఆడారు. ఐపీఎల్‌లో PWI, KKRకు ప్రాతినిథ్యం వహించారు. ఆయన ఎవరో గుర్తు పట్టి కామెంట్ చేయండి.

News September 19, 2024

మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

image

UPలోని బృందావన్ రోడ్ స్టేషన్ సమీపంలో బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. 20 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనతో ఢిల్లీ-మథుర మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యుద్ధప్రాతిపదికన ఆ రూట్‌ను క్లియర్ చేసేందుకు రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవలకాలంలో దేశంలో వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి.

News September 19, 2024

సెప్టెంబర్ 19: చరిత్రలో ఈరోజు

image

✒ 1887: రచయిత, నాస్తికుడు తాపీ ధర్మారావు జననం
✒ 1911: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బోయి భీమన్న జననం
✒ 1924: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ జననం
✒ 1977: క్రికెటర్ ఆకాశ్ చోప్రా జననం
✒ 1965: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ జననం
✒ 2014: మాండలిన్ విద్వాంసుడు ఉప్పలపు శ్రీనివాస్ మరణం