News October 23, 2024
ప్రభాస్‌పై కవిత అదిరిందిగా!
రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రభాస్‌పై కవిత్వం రాశారు. ‘ఈశ్వర్‌గా వెండితెరపై ప్రత్యక్షమై, వర్షంతో అభిమానుల హర్షంతో మురిసి, ఛత్రపతితో అలరించి, బుజ్జిగాడుగా మురిపించి, ప్రేక్షకుల హృదయాల్లో మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా, అందరి డార్లింగ్‌గా స్థానం సంపాదించి, మాస్ ప్రేక్షకులకు మిర్చి రుచి చూపించి, నన్ను పెద్దనాన్న అని గౌరవించిన ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు. వెండి తెర రారాజుగా విలసిల్లు’ అని ఆశీర్వదించారు.
Similar News
News November 4, 2024
రేపు రాష్ట్రానికి రాహుల్ గాంధీ
TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు రాష్ట్రానికి రానున్నారు. సా.4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలు, విద్యావేత్తలతో సమావేశమై కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఈ సమావేశానికి దాదాపు 400 మందికి ఆహ్వానం అందినట్లు సమాచారం.
News November 4, 2024
GREAT: ₹5000 నుంచి ₹50,000 కోట్లకు..
యంగ్ ఆంత్రప్రెన్యూర్స్‌కు Waree టెక్నాలజీ ఛైర్మన్ హితేశ్ చిమన్‌లాల్ ఆదర్శనీయం. కిరాణాకొట్టు యజమాని కొడుకైన ఆయన చదువుకుంటున్నప్పుడే 1985లో బంధువుల దగ్గర రూ.5000 అప్పు తీసుకొని జర్నీ ఆరంభించారు. 1989లో వ్యాపారం విస్తరించి తొలి ఏడాదిలో రూ.12వేల టర్నోవర్ సాధించారు. కట్‌చేస్తే 40ఏళ్ల తర్వాత కంపెనీ మార్కెట్ విలువ రూ.71,244 కోట్లకు చేరింది. IPOకు రావడంతో ఆయన కుటుంబ నెట్‌వర్త్ రూ.50వేల కోట్లను తాకింది.
News November 4, 2024
అన్నపూర్ణ స్టూడియోలోనే చైతూ-శోభిత పెళ్లి?
అక్కినేని నాగ చైతన్య-శోభితల పెళ్లి పనులు మొదలవడంతో వెడ్డింగ్ వేదిక ఎక్కడనే చర్చ మొదలైంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని వార్తలు రాగా అందుకు భిన్నంగా HYD అన్నపూర్ణ స్టూడియోలోనే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సెట్టింగ్, డెకరేషన్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఇరు ఫ్యామిలీలు పెళ్లి పిలుపులను ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా డిసెంబర్ 4న వీరి వివాహం జరుగుతుందని టాక్.