News August 4, 2024
మహిళను దారుణంగా కొట్టిన పోలీసులు

TG: షాద్‌నగర్ పీఎస్‌లో ఓ ఎస్సీ మహిళను పోలీసులు దారుణంగా కొట్టడంపై విమర్శలొస్తున్నాయి. బంగారం దొంగలించారన్న ఆరోపణలతో బాధిత మహిళను పీఎస్‌కు తీసుకెళ్లిన పోలీసులు, ఆమెపై కేసు నమోదు చేశారు. 10 రోజులు గడిచినా రిమాండ్ చేయలేదు. తర్వాత ఇంటికి పంపారు. దొంగతనం ఒప్పుకోవాలని పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సీఐ రాంరెడ్డిని బదిలీ చేశారు.
Similar News
News March 3, 2026
హార్ముజ్ మూసివేత.. సౌదీ కొత్త ప్లాన్!

హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో క్రూడాయిల్ సరఫరాకు సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఎర్ర సముద్ర తీరంలోని యంబు టెర్మినల్ నుంచి ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఇందుకోసం పర్షియన్ గల్ఫ్ ఫీల్డ్స్‌లోని Abqaiq నుంచి పైపుల ద్వారా క్రూడాయిల్‌ను యంబుకు తరలిస్తారు. అక్కడి నుంచి సూయజ్ కెనాల్ మార్గంలో ఓడల ద్వారా యూరప్ వైపు, బాబ్-అల్-మందెబ్ జలసంధి ద్వారా హిందూ మహాసముద్రంవైపు తరలించవచ్చు.
News March 3, 2026
ఇరాన్ చర్చలకు సిద్ధం అంటోంది: ట్రంప్

ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ, నాయకత్వాన్ని నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తమతో చర్చలకు సిద్ధమని ఇరాన్ అంటోందని, కానీ ఇప్పటికే ఆలస్యమైందని చెప్పానని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఈ యుద్ధం 4-5 వారాలపాటు కొనసాగవచ్చని తెలిపారు. ఆ లోపు ముగించేస్తామని, ఇజ్రాయెల్-US దళాలకు ఇది పెద్ద కష్టం కాదని చెప్పారు.
News March 3, 2026
నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: సీఎం రేవంత్

TG: నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను CM రేవంత్ ఆదేశించారు. MAR 6 నుంచి JUNE 12 వరకు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై దిశానిర్దేశం చేశారు. ‘ప్రభుత్వ పథకాలు, విద్యా వ్యవస్థలో మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ ఆస్పత్రులను సమీప మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలి. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లులు సమయానికి చెల్లించాలి’ అని సూచించారు.


