News August 4, 2024

మహిళను దారుణంగా కొట్టిన పోలీసులు

image

TG: షాద్‌నగర్ పీఎస్‌లో ఓ ఎస్సీ మహిళను పోలీసులు దారుణంగా కొట్టడంపై విమర్శలొస్తున్నాయి. బంగారం దొంగలించారన్న ఆరోపణలతో బాధిత మహిళను పీఎస్‌కు తీసుకెళ్లిన పోలీసులు, ఆమెపై కేసు నమోదు చేశారు. 10 రోజులు గడిచినా రిమాండ్ చేయలేదు. తర్వాత ఇంటికి పంపారు. దొంగతనం ఒప్పుకోవాలని పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సీఐ రాంరెడ్డిని బదిలీ చేశారు.

Similar News

News September 15, 2024

వరదలపై అసత్య ప్రచారం వైసీపీ కుట్ర: మంత్రి నారాయణ

image

AP: విజయవాడలో మళ్లీ వరదలు వస్తున్నాయని జరిగిన ప్రచారం వెనుక వైసీపీ కుట్ర ఉందని మంత్రి నారాయణ ఆరోపించారు. వరదలపై అసత్య పోస్టుల గురించి డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో పరిస్థితి మెరుగైందని అన్నారు. అగ్నిమాపక శకటాలతో ఇళ్లు శుభ్రం చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

News September 15, 2024

ముగ్గురు ఐపీఎస్‌లకు ప్రభుత్వం షాక్

image

AP: ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, మరో ఐపీఎస్ విశాల్ గున్నిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పేరుతో ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధించారని వీరిపై ఆరోపణలున్నాయి.

News September 15, 2024

ఇవాళే ఎందుకు రాజీనామా చేయకూడదు?: బీజేపీ

image

ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ 48 గంటల్లో కాకుండా ఇవాళే ఎందుకు రాజీనామా చేయకూడదని బీజేపీ ప్రశ్నించింది. ఆప్ చీఫ్ ఎందుకీ డ్రామా క్రియేట్ చేస్తున్నారని దుయ్యబట్టింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనే ఆ పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొంది. రోడ్లపై కేజ్రీవాల్ ప్రచారం చేసినా ప్రజలు ఆయనను సరైన స్థానంలో ఉంచారని విమర్శించింది. మరోవైపు సీఎం రాజీనామా నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది.