News November 24, 2024
పోలీసులు ఎక్కడ పడితే అక్కడ చేతులేశారు: లగచర్ల మహిళలు
TG: <<14585618>>లగచర్లలో<<>> NHRC బృందం పర్యటించి బాధితులతో మాట్లాడింది. ఈ ఘటన జరిగిన రోజు(Nov 11) రాత్రి కరెంట్ తీసేసి తమ ఇళ్లలోకి పోలీసులు దూరి మగవాళ్లను తీసుకెళ్లారని మహిళలు NHRC అధికారులకు చెప్పారు. భర్తలను తీసుకెళ్లవద్దని అడ్డుపడిన తమపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేశారన్నారు. అసభ్యంగా తిట్టారని వివరించారు. డెలివరీ చేయించుకోవాలని బతిమాలినా వినలేదని ఓ గర్భిణీ ఆవేదన వ్యక్తం చేసింది.
Similar News
News November 24, 2024
28న ‘గేమ్ ఛేంజర్’ నుంచి థర్డ్ సింగిల్
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ నెల 28న థర్డ్ సింగిల్ విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో అంజలి కీలకపాత్ర పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
News November 24, 2024
రెండు రాష్ట్రాల్లో DBTలు పనిచేశాయి
MH, ఝార్ఖండ్ ఎన్నికల్లో అధికార పార్టీలు గెలవడం వెనుక DBT పథకాలు పనిచేసినట్టు స్పష్టమవుతోంది. MHలో లడ్కీ బెహెన్, ఝార్ఖండ్‌లో CM మయ్యా సమ్మాన్ యోజన పథకాల ద్వారా మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం ఫలితాలపై ప్రభావం చూపింది. పైగా ప్రస్తుతం ఇస్తున్న ₹1,500ను ₹2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించింది. అలాగే ₹1000 సాయాన్ని ₹2,500కు పెంచుతామని హేమంత్ సోరెన్ హామీ ఇవ్వడం కలిసొచ్చింది.
News November 24, 2024
విశాఖలో రైల్వే జోనల్ కార్యాలయం నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం
AP: విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. స్థానికంగా జోనల్ కార్యాలయం ఏర్పాటుకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ టెండర్లను ఆహ్వానించారు. రెండు సెల్లార్ల పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టనున్నారు. అయితే 9 ఫ్లోర్ల నిర్మాణానికి టెండర్లు దాఖలు చేయాలని మంత్రి ట్వీట్ చేశారు.