News November 24, 2024

28న ‘గేమ్ ఛేంజర్’ నుంచి థర్డ్ సింగిల్

image

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ నెల 28న థర్డ్ సింగిల్ విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో అంజలి కీలకపాత్ర పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Similar News

News December 12, 2024

రాష్ట్ర పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

image

AP: రాష్ట్రంలో హెల్మెట్‌ నిబంధన అమలు కావట్లేదని పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల 667 మంది మరణించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో హెల్మెట్‌ నిబంధన ఎందుకు అమలు చేయట్లేదు? అని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ మరణాలకు బాధ్యత ఎవరిది? అని సీరియస్ అయింది. దీనిపై వారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

News December 12, 2024

వాట్సాప్, FB సేవలు డౌన్.. స్పందించిన ‘మెటా’

image

FB, ఇన్‌స్టా, వాట్సాప్ సేవలు <<14854292>>డౌన్<<>> అవ్వడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఈ యాప్‌ల మాతృసంస్థ మెటా స్పందించింది. తమ అప్లికేషన్లను కొందరు వినియోగదారులు యాక్సెస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలిసిందని పేర్కొంది. సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగిందని, వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది. అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు కోరింది.

News December 12, 2024

400 బి.డాలర్ల సంపద దాటేసిన మస్క్

image

స్పేస్ ఎక్స్, టెస్లా CEO మస్క్ సంపద 400 బి.డాలర్లు దాటింది. దీంతో ఆయన ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు. స్పేస్‌ఎక్స్‌ ఇన్‌సైడర్ షేర్ ట్రేడింగ్, అగ్రరాజ్య ఎన్నికల్లో ఆయన మద్దతిచ్చిన ట్రంప్ విజయం సంపదను అమాంతం పెంచాయి. ప్రస్తుతం మస్క్ సంపద 439.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ సూచీ తెలిపింది. అమెరికా ఎన్నికల ముందు నుంచి ఇప్పటివరకు టెస్లా షేర్లు 65% పెరిగాయంది.