News April 7, 2024

చంద్రబాబు డీఎన్ఏలోనే హత్యా రాజకీయాలు: మంత్రి కారుమూరి

image

AP: కిరాణ షాపుల్లో డ్రగ్స్ దొరుకుతున్నాయన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు వైశ్యులను అవమానించారని మండిపడ్డారు. ఆయన బంధువులే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు డీఎన్ఏలోనే హత్యా రాజకీయాలున్నాయని.. సొంత మామను వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. బాబు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

Similar News

News January 24, 2025

రాష్ట్రంలో పెరిగిన వ్యవసాయ కుటుంబాలు

image

AP: రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. 2016-17లో నాబార్డ్ రూరల్ ఫైనాన్షియల్ సర్వే ప్రకారం 34 శాతం వ్యవసాయ కుటుంబాలు ఉంటే, 2021-22లో ఆ సంఖ్య 53 శాతానికి చేరింది. దీంతో ఐదేళ్లలో రాష్ట్రంలో 19శాతం మేర వ్యవసాయ కుటుంబాలు పెరిగినట్లైంది. అటు దేశ సరాసరి కూడా 48% నుంచి 57%కు పెరిగింది. APతో పాటు దేశంలోని 20 రాష్ట్రాల్లో 50శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడ్డాయి.

News January 24, 2025

జేఈఈ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేశారా?

image

జనవరి 28, 29, 30 తేదీల్లో జరిగే జేఈఈ మెయిన్ పరీక్షల అడ్మిట్ కార్డులను NTA తాజాగా విడుదల చేసింది. ఈ నెల 24 వరకు జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులను గతంలోనే రిలీజ్ చేయగా, మిగతా రోజుల్లో జరిగే ఎగ్జామ్స్ కోసం తాజాగా ఆన్‌లైన్‌లో పెట్టింది. విద్యార్థులు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News January 24, 2025

నాన్‌స్టాప్ అడ్వెంచర్‌గా రాజమౌళి-మహేశ్ మూవీ!

image

మహేశ్‌తో రాజమౌళి చిత్రీకరిస్తున్న మూవీ అమెజాన్ అడవుల నేపథ్యంలో నాన్‌స్టాప్ అడ్వెంచర్‌గా ఉంటుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే HYD అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. ఈ నెలాఖరులో మరో షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. హీరోయిన్‌గా ప్రియాంకా చోప్రా ఫైనల్ అయ్యారని, ఆమె బల్క్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.