News April 7, 2025
కూటమి ప్రభుత్వంలో పేదోడికి వైద్యం అందని ద్రాక్ష: షర్మిల

AP: కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలకు దిగారు. పేరుకే రైజింగ్ స్టేట్ అని, పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదని దుయ్యబట్టారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యమన్నారు. వైద్య సేవల కింద రూ.3,500 కోట్ల బకాయిలు ఉంచడం సిగ్గుచేటని, కూటమి ప్రభుత్వంలో పేదోడికి వైద్యం అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు. తిరిగి సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 14, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 14, 2025
శుభ సమయం (14-11-2025) శుక్రవారం

✒ తిథి: బహుళ దశమి తె.3.34 వరకు
✒ నక్షత్రం: పుబ్బ రా.12.49 వరకు
✒ శుభ సమయాలు: ఉ.10.10-10.40, సా.5.10-5.25
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
✒ యమగండం: మ.3.00-సా.4.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, మ.12.24-మ.1.12
✒ వర్జ్యం: ఉ.8.26-ఉ.10.04
✒ అమృత ఘడియలు: సా.6.29-రా.8.07
News November 14, 2025
నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*ఏపీలో రూ.82వేల కోట్లతో రెన్యూ ఎనర్జీ కంపెనీ పెట్టుబడులు
*2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలు: CM CBN
*మంత్రి కొండా సురేఖ క్షమాపణలు.. కేసు విత్డ్రా చేసుకున్న నాగార్జున
*తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దరఖాస్తులు
*అల్ ఫలాహ్ వర్సిటీ సభ్యత్వం రద్దు చేసిన AIU
*బంగ్లాలో మళ్లీ హింస.. బాంబు దాడులు
*IPL: ముంబైలోకి శార్దుల్ ఠాకూర్, రూథర్ఫర్డ్


