News April 7, 2025
కూటమి ప్రభుత్వంలో పేదోడికి వైద్యం అందని ద్రాక్ష: షర్మిల

AP: కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలకు దిగారు. పేరుకే రైజింగ్ స్టేట్ అని, పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదని దుయ్యబట్టారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యమన్నారు. వైద్య సేవల కింద రూ.3,500 కోట్ల బకాయిలు ఉంచడం సిగ్గుచేటని, కూటమి ప్రభుత్వంలో పేదోడికి వైద్యం అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు. తిరిగి సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News April 17, 2025
ఈ నెల 24న OTTలోకి ‘L2: ఎంపురాన్’

పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘L2: ఎంపురాన్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఈ నెల 24 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.270 కోట్ల కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
News April 17, 2025
రేపు హాల్ టికెట్లు విడుదల

AP: పలు ఉద్యోగ పరీక్షల హాల్‌టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు APPSC ప్రకటించింది. అభ్యర్థులు https://psc.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఈ నెల 28న, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ జాబ్స్‌కు 28, 29న పరీక్షలు జరుగుతాయి. ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు 28న పేపర్-1, 30న పేపర్-2, పేపర్-3 ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
News April 17, 2025
జేఈఈ మెయిన్ ఫైనల్ ‘కీ’ విడుదల

జేఈఈ మెయిన్ సెషన్ 2 <