News February 5, 2025
ఓసీల జనాభా తగ్గి, బీసీల జనాభా పెరిగింది: మంత్రి ఉత్తమ్

TG: కులగణనలో బీసీ జనాభా తగ్గిందని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ ఫైరయ్యారు. గత గణాంకాలతో పోలిస్తే బీసీ జనాభా పెరిగిందని తెలిపారు. BRS పాలనలో 51.09%గా నమోదైన బీసీ జనాభా శాతం ఇప్పుడు 56.33%కు పెరిగిందన్నారు. ఓసీల జనాభా 21.55% నుంచి 15.79%కు తగ్గిందని చెప్పారు. ఈ సర్వే ద్వారా అందిన గణాంకాలను పాలన, సంక్షేమ విధానాల్లో వినియోగిస్తామని మంత్రి వివరించారు.
Similar News
News March 16, 2025
మీపై నమ్మకం ఉంచుకోండి: సీఎం చంద్రబాబు

AP: రేపటి నుంచి టెన్త్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘పరీక్షలు మీ విద్యా ప్రయాణంలో ఓ కీలకమైన మైలురాయి. దృష్టి కేంద్రీకరించి కష్టపడి పని చేయండి. మీ సమయాన్ని తెలివిగా వినియోగించుకోండి. మీపై మీకు నమ్మకం ఉంటే విజయం వెంటాడుతుందని గుర్తుంచుకోండి’ అని ట్వీట్ చేశారు.
News March 16, 2025
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్

AP: ఇటీవల శ్రీశైల మల్లన్న భక్తులు పలువురు నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవడంతో ఆలయం ఈవో శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు. వసతి, దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాలన్నారు. www.srisailamdevasthanam.org, www.aptemples.ap.gov.in దేవస్థానం, దేవాదాయ శాఖ వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలన్నారు. దేవస్థానం వివరాలకు 83339 01351, 52, 53 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News March 16, 2025
విద్యార్థినులపై ప్రొఫెసర్ లైంగికదాడి.. వీడియోలు వైరల్

విద్యార్థినుల పాలిట గురువే కీచకుడిగా మారాడు. యూపీ హథ్రాస్‌లోని పీజీ కాలేజీ ప్రొఫెసర్ విద్యార్థినులకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన 59 వీడియోలు సోషల్ మీడియాలో వైరలవ్వగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చేపట్టారు. కాగా ప్రొఫెసర్ గతంలోనూ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం.