News June 5, 2024
టీడీపీకి ‘జలశక్తి’ మంత్రి పదవి.. తెలంగాణకు నష్టమా?
కేంద్ర ‘జలశక్తి’ మంత్రి పదవిని టీడీపీ ఆశిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే తెలంగాణ నీటి వనరులు, కేటాయింపులపై తీవ్ర ప్రభావం పడొచ్చు. TG అసెంబ్లీ పోలింగ్ రోజు సాగర్ డ్యామ్‌ను AP అధీనంలోకి తీసుకుంది. దీంతో జలశక్తి పరిధిలోని KRMB రంగంలోకి దిగింది. సాగర్లో అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో TGకి 8.5, APకి 5.5 టీఎంసీల నీటిని ఏప్రిల్‌లో కేటాయించింది. ఇకపై వివాదాలు ముదిరితే ఏపీదే పైచేయి కావొచ్చు. మీరేమంటారు?
Similar News
News December 10, 2024
ఆర్జీవీ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
AP: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అసభ్యకర పోస్టులు చేశారనే ఆరోపణలతో ఆర్జీవీపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీటిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది.
News December 10, 2024
వచ్చే వారం పోలవరంలో సీఎం పర్యటన
AP: సీఎం చంద్రబాబు వచ్చేవారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన టైమ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తారని తెలిపారు. జనవరి నుంచి డయాఫ్రం వాల్ పనులు మొదలవుతాయన్నారు. దానికి సమాంతరంగా ఎర్త్ కం రాక్ ఫిల్లింగ్ పనులు కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పునరావాస పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 10, 2024
నాగబాబుకు మంత్రి పదవి ఎలా ఖరారైందంటే?
AP: రాష్ట్రంలో ప్రస్తుతం 24మంది మంత్రులున్నారు. అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి మరొకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. కాగా, TDP పొత్తులో భాగంగా జనసేనకు 4, BJPకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. జనసేన నుంచి పవన్, మనోహర్, దుర్గేశ్ ఇప్పటికే మంత్రులుగా ఉన్నారు. జనసేనకు దక్కాల్సిన మరో స్థానాన్ని నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు CM చంద్రబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు.